దీపారాధన చేస్తున్నప్పుడు.. ఈ 5 తప్పులని అస్సలు చెయ్యకండి..!

Ads

ప్రతిరోజు ప్రతి ఒక్కరూ ఇంట్లో దీపాన్ని పెడుతూ ఉంటారు. పూజని ప్రారంభించే ముందు దీపాన్ని వెలిగించి ఆ తర్వాత పూజా విధానాన్ని మొదలు పెడుతూ ఉంటారు. కార్తీక మాసంలో అయితే తెల్లవారుజామునే మహిళలు లేచి దీపాలని వెలిగిస్తూ ఉంటారు కార్తీక మాసంలో శివుడిని పూజిస్తే ఎంతో పుణ్యం మనకి లభిస్తుంది. అదే విధంగా మహాశివరాత్రి నాడు కూడా శివుడికి పూజ చేస్తే చాలా చక్కటి ఫలితాలని మనం పొందొచ్చు.

శివుడు భక్తులైతే ప్రతి సోమవారం దీపారాధన చేస్తూ ఉంటారు. అయితే శివుడికి మాత్రమే కాదు ఏ దేవుడికి దీపం పెట్టినా కొన్ని పొరపాట్లని అస్సలు చేయకూడదు. మరి దేవుడికి దీపం పెట్టేటప్పుడు ఎటువంటి పొరపాట్లని మనం చేయకూడదు అనే విషయాన్ని ఇప్పుడు చూద్దాం.

దీపారాధన చేస్తున్నప్పుడు ఈ పొరపాట్లని అస్సలు చేయొద్దు:

  1. స్టీలు కుందులలో దీపాన్ని పెట్టొద్దు:

చాలామంది దీపాలని స్టీల్ కుందుల్లో పెడతారు ఇలా పెట్టడం అస్సలు మంచిది కాదు. దీపారాధన చేసేటప్పుడు ఇతర పదార్థాలతో చేసిన కుందులను మాత్రమే మీరు దీపారాధనకి ఉపయోగించండి. మట్టితో చేసినవి అయితే మరీ మంచిది.

Ads

2. ఒక వత్తుని పెట్టకండి:

దీపారాధన చేస్తున్నప్పుడు చాలామంది ఒక వత్తు పెట్టి దీపాన్ని వెలిగిస్తారు ఏకవత్తు కేవలం శవం వద్ద మాత్రమే వెలిగిస్తారు కాబట్టి ఈ పొరపాటున చేయొద్దు.

3. అగ్గిపుల్లతో వెలిగించకండి:

ఎక్కువ మంది చేసే పొరపాటు ఇదే. దీపాన్ని అగ్గిపుల్లతో వెలిగిస్తారు కానీ అగరబత్తితో వెలిగించడం మంచిది.

4. దీపారాధన చేసాక ఇలా చేయండి:

దీపారాధన చేసిన తర్వాత కుందుకు మూడు చోట్ల కుంకుమ బొట్టు పెట్టాలి ఆ తర్వాత అక్షింతలు వేయాలి.

5. విష్ణుమూర్తికి దీపాన్ని ఇలా పెట్టండి:

విష్ణుమూర్తికి దీపాన్ని పెట్టినప్పుడు దీపాన్ని వెలిగించి విష్ణుమూర్తికి కుడి వైపున దీపాన్ని పెట్టండి. విష్ణుమూర్తికి ఎదురుగా దీపాన్ని పెట్టకూడదు. చూశారు కదా పండితులు చెప్పిన నియమాలని.. మరి ఈ నియమాలని మీరు దీపారాధన చేసేటప్పుడు ఖచ్చితంగా అనుసరించండి. ఏ తప్పు చేయకుండా దీపారాధన చేస్తే పుణ్యం వస్తుంది.

Previous articleఅత్యంత ధనవంతులైన టాప్ 5 టాలీవుడ్ హీరోలు వీళ్ళే..!
Next article“అమిగోస్” మూవీ రివ్యూ.. కళ్యాణ్ రామ్ ఖాతాలో మరో హిట్ పడినట్టేనా?