Ads
ఈసారి ప్రపంచ కప్ క్రికెట్ మ్యాచ్ కి ఆతిథ్యం ఇస్తున్న టీమ్ ఇండియా క్రికెట్ అభిమానుల హాట్ ఫేవరెట్ గా రంగంలోకి దిగడానికి సిద్ధంగా ఉంది. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ ,పాకిస్తాన్, సౌత్ ఆఫ్రికా, న్యూజిలాండ్.. ఇలా ఎన్నో దీటైన టీమ్లకు వణుకు పుట్టించే టీమ్ ఇండియా మాత్రం ప్రస్తుతం ఒక పురుగు దేశం టీమును చూసి భయపడుతోంది అని టాక్ నడుస్తోంది.
వన్డే ప్రపంచ కప్ ను కైవసం చేసుకొని టీమిండియా కు ఇప్పటికే పుష్కరకాలం గడుస్తోంది. 2011లో జరిగిన వన్డే ప్రపంచ కప్ మ్యాచ్లలో చివరిసారిగా టీం ఇండియా ప్రపంచ కప్ తన ఖాతాలో వేసుకుంది. ఇక ఆ తర్వాత నుంచి ఇప్పటివరకు.. రెండుసార్లు ప్రపంచ కప్ లో పాల్గొన్నప్పటికీ ఛాంపియన్గా నిలవలేదు సరి కదా సెమీఫైనల్ వరకు చేరుకొని ఇంటి దారి పట్టింది.
Ads
ఈసారి జరగబోయే వన్డే ప్రపంచ కప్ కు ఆతిథ్యం భారతీయ ఇస్తోంది కాబట్టి.. ఎలాగైనా కప్పు సొంతం చేసుకోవాలి అని క్రికెట్ అభిమానులు ఆశిస్తున్నారు. అలాగే టీం ఇండియా కూడా ఈసారి ఎలాగైనా ప్రపంచ సాధించాలి అన్న పట్టుదల మీదే ఉంది. అయితే గత కొద్ది కాలంగా బంగ్లాదేశ్ జట్టు నిలకడైన ప్రదర్శన కనబరుస్తుంది. పైగా ఈ మధ్యకాలంలో బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్లలో టీమిండియా పేలవమైన ప్రదర్శనకే పరిమితం అయింది.
2017లో వన్డే ప్రపంచ కప్ నేపథ్యంలో బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్లో టీమ్ ఇండియా గెలుపు ఎంతో కష్టంగా నమోదు అయింది.2022లో బంగ్లాదేశ్ లో భారత్ పర్యటించినప్పుడు వన్డే సిరీస్ చేయి జారిపోయింది. 2022 టి20 ప్రపంచ కప్ లో భాగంగా జరిగిన మ్యాచ్ లో కూడా వెంట్రుక వాసి తేడాతో బంగ్లాదేశ్ పై అతి కష్టం మీద టీమిండియా గెలవగలిగింది.నిన్నటికి నిన్న ఆసియా కప్ 2023లో కూడా టీమిండియా బంగ్లాదేశ్ చేతిలో ఓడిపోయింది. అందుకే ప్రస్తుతం జరగబోయే ప్రపంచ కప్ లో బంగ్లాదేశ్ జట్టు వల్ల భారత్ కు పెను ప్రమాదమే పొంచి ఉంది అని విశ్లేషకులు భావిస్తున్నారు.