ఏంటి “సమంత” ఈ 8 సినిమాలు రిజెక్ట్ చేసిందా.? అందులో బ్లాక్ బస్టర్ సినిమాలు కూడా.?

Ads

ఎప్పుడు ఏదో ఒక న్యూస్ తో వైరల్ అవుతున్న సమంత ప్రత్యేకంగా ఎటువంటి ఇంట్రడక్షన్ అవసరం లేని హీరోయిన్. ఏం మాయ చేసావో సినిమాతో ఎంట్రీ ఇచ్చి కుర్ర కారు మదిని మాయ చేసి హీరోయిన్గా అంచలంచలుగా ఎదిగిన సమంత తన కెరీర్లో ఎన్నో మంచి అవకాశాలను వదులుతుంది. అవి కూడా మామూలు సినిమాలు కాదు సూపర్ హిట్ అయ్యే ఆస్కారం ఉన్న సినిమాలను సమంతా వదులుకుంది. మరి ఆ మూవీస్ ఏంటో ఒక లుక్ వేద్దాం పదండి…

మణిరత్నం “కడలి” మూవీ లో హీరోయిన్గా సమంతను తీసుకోవాలి అనుకున్నప్పుడు చివరి నిమిషంలో ఆమె తప్పుకోవడంతో రాధా రెండవ కూతురు తులసికి అవకాశం దక్కింది. రామ్ చరణ్ “ఎవడు” మూవీలో హీరోయిన్గా అనుకున్న సమంత , కొన్ని అనారోగ్య సమస్యల కారణంగా మూవీ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. విక్రమ్ ఐ మూవీ లో కూడా మొదట సమంతను హీరోయిన్ గా అనౌన్స్ చేశారు. అయితే కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల స్యామ్ తప్పుకోవడం జరిగింది.

Ads

రామ్ చరణ్ బ్రూస్లీ మూవీ లో కూడా సమంతను హీరోయిన్ గా అనుకున్నప్పటికీ ఇతర సినిమాల బిజీ షెడ్యూల్ కారణంగా ఈ ఆఫర్ రకుల్ కు దక్కింది. నాని నిన్ను కోరి మూవీ లో కూడా సమంతకు ఆఫర్ వచ్చింది.. అయితే పెళ్లి పనుల్లో బిజీగా ఉండడం వల్ల సమంత ఆ మూవీ చేయలేకపోయింది. బాలకృష్ణ ఎన్టీఆర్ చరిత్రను సినిమా రూపంగా తీసిన ఎన్టీఆర్ కథానాయకుడు చిత్రంలో కూడా.. ఓ పాత హీరోయిన్ పాత్ర కోసం సమంతను అనుకున్నారు. కానీ సమంత వేరే సినిమాల్లో బిజీగా ఉండడంతో ఈ మూవీలో చేయలేకపోయింది.

అలియా భట్ బాలీవుడ్ సెలబ్రిటీగా చేసిన స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ చిత్రంలో మొదట సమంతను తీసుకోవాలని అనుకున్నారు. అయితే సమంత ఆసక్తి చూపించకపోవడంతో ఆలియా భట్ ఈ చిత్రం ద్వారా సినీ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చింది. అలాగే నయనతార మాయ మూవీ సమంత చేయాల్సింది కానీ కొన్ని కారణాలవల్ల అది నయనతార చేతుల్లోకి వెళ్ళింది. ప్రస్తుతం టాలీవుడ్ లో హాట్ మూవీ పుష్ప లో మొదట హీరోయిన్ గా సమంత చేయాల్సింది.. కానీ సమంత నో చెప్పడంతో సీన్లోకి రష్మిక వచ్చింది. ఇలా సమంత తన కెరియర్ లో చాలా మంచి చిత్రాలను మిస్ చేసుకుంది.

Previous articleఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్ కాదు…వరల్డ్ కప్ లో ఈ టీం తో ఇండియాకి కష్టం అనుకుంటా.? ఎందుకంటే.?
Next articleవైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా ఏకంగా 5 మంది బిగ్ బాస్ లోకి…వైరల్ అవుతున్న లిస్ట్.!
Hi, This is Harika. I have been working as a web content writer in PRATHIDVANI from the past one year and am experienced in writing articles in cinema, sports, inspiring stories and flash news categories.