Ads
సినీ ఇండస్ట్రీలో చాలా వరకు సెలబ్రెటీలు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అయితే అలా చేసుకున్న వారిలో విడాకులు తుసకోకుండా ఉన్నవారిని వేళ్ల పై లెక్కపెట్టొచ్చు.
Ads
ఇక విడాకులు తీసుకున్నప్పుడు సెలబ్రెటీలు కూడా సాధారణ భార్యా భర్తల లాగానే భరణం ఇవ్వడం ఆనవాయితీ. ఇక సెలెబ్రిటీలుగా కోట్లలో సంపాదిస్తారు. కాబట్టి భరణం కూడా భారీగానే ఉంటుంది. మరి సెలెబ్రిటీల లైఫ్ లో జరిగిన ఖరీదైన విడాకుల గురించి చూద్దాం..ప్రభు దేవా-రమాలత:
ప్రముఖ కొరియోగ్రాఫర్,హీరో ప్రభుదేవా భార్య రమాలతకు విడాకులు ఇచ్చాడు. ఈ సమయంలో ప్రభుదేవా 25 కోట్ల భరణం,కాకుండా రెండు ఖరీదైన కార్లను భార్యకు ఇచ్చాడు. అయితే నయనతారతో ప్రేమలో పడిన తరవాత ప్రభుదేవా తన భార్యకు విడాకులు ఇచ్చాడు.కరిష్మా కపూర్- సంజయ్ కపూర్:
కరిష్మా కపూర్ 90వ దశకంలో బాలీవుడ్ ను షేక్ చేసిన కథానాయక. కరిష్మా కపూర్ హీరోయిన్ గా టాప్ ప్లేస్ లో ఉన్న టైమ్ లోనే సంజయ్ కపూర్ ను వివాహం చేసుకుంది. ఈ జంట ఆ తరవాత అమెరికాలో స్థిరపడింది. వీరికి ఇద్దరు పిల్లల తరవాత విడాకులు తీసుకున్నారు. సంజయ్ కపూర్ కరిష్మాకు 11కోట్ల భరణాన్ని, అవే కాకుండా ఖరీదైన కార్లు, ఒక భవనం భరణంగా ముట్ట జెప్పాడు.హృతిక్ రోషన్-సుస్సానె ఖాన్:
బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ చిన్ననాటి స్నేహితురాలు సుస్సానె ఖాన్ ను పెళ్లి చేసుకున్నాడు. అయితే ఇద్దరు పిల్లలు పుట్టిన తరవాత విడాకులు తీసుకున్నారు. ఆ సమయంలో హృతిక్ సుస్సానె ఖాన్ కు రూ.5 కోట్ల భరణంతో పాటు, ఆస్తిలో ఇద్దరు పిల్లలకు వాటా ఇచ్చేలా ఒప్పందం జరిగింది.పవన్ కల్యాణ్-నందిని:
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఫస్ట్ భార్య నందినికి రూ.1 కోటి రూపాయలు భరణంగా ఇచ్చాడు. అనంతరం నటి రేణూ దేశాయ్ ని వివాహం చేసుకున్న పవన్, ఆ తరువాత మనస్పర్థలతో విడాకులు తీసుకున్నారు. అయితే విడాకుల సమయంలో పవన్ పిల్లలకు కోట్ల రూపాయల ఆస్తులను ఇచ్చారని ప్రచారం అయితే జరిగింది. వాటిని రేణు దేశాయ్ ఖండించింది.
Also Read: ‘హిట్2’ వరకు తెలుగులో రూపొందిన 10 సైకో కిల్లర్ సినిమాల లిస్ట్..!