‘హిట్2’ వరకు తెలుగులో రూపొందిన 10 సైకో కిల్లర్ సినిమాల లిస్ట్..!

Ads

టాలీవుడ్ లో థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడే ఆడియెన్స్ ఎక్కువగానే ఉంటుంది. వీటిలో సైకో కిల్లర్ నేపథ్యంలో వచ్చిన సినిమాలకు విపరీతమైన క్రేజ్. అయితే ఇలాంటి మూవీస్ చేయడానికి డైరెక్టర్స్ పెద్దగా ఇంట్రెస్ట్ చూపించరు. దీనికి కారణం సైకోలు చేసే మర్డర్స్ లో లాజిక్స్ ఉండదు.

సైకోలను మానసికంగా ఏదో ఒక ఇన్సిడెంట్ భాధ పెడుతుంది. అయితే అది వాళ్ళ దృష్టిలో తప్పు. కాబట్టి హత్యలు చేస్తున్నట్టుగా మూవీస్ లో చూపిస్తారు. అయితే థ్రిల్లర్ సినిమాలో లాజిక్ లు నిర్దిష్టంగా లేకపోయినా కొంచెం రిలేటెడ్ గా అయినా ఉండాలి. లేదంటే ఆ సినిమా ఇబ్బందిలో పడుతుంది. టాలీవుడ్ లో కూడా సైకో కిల్లర్ బ్యాక్ డ్రాప్ లో కొన్ని సినిమాలు వచ్చాయి. వాటిలో కొన్ని హిట్ అయితే, ఇంకొన్ని నిరాశ పర్చాయి. ఆ సినిమాలు ఏమిటో చూద్దాం..1) ఎవరు(1999) :
బాలీవుడ్ హీరోయిన్ ఊర్మిళ ప్రధాన పాత్రలో రూపొందిన సైకో కిల్లర్ సినిమాకి రాంగోపాల్ వర్మ దర్శకుడు. 1999 లో వచ్చిన ఈ సినిమా నాలుగు రోజులు కూడా ఆడలేదు. వర్మ ఈ సినిమాని 15 రోజుల్లోనే తీసాడు.2)ఏ ఫిలిం బై అరవింద్ :
ఈ సినిమాకి శేఖర్ సూరి డైరెక్టర్. ఏ మాత్రం అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమా ఆడియెన్స్ ను బాగా ఆకట్టుకుంది.

3) అనసూయ :
భూమిక ప్రధాన పాత్రలో రవిబాబు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సైకో కిల్లర్ నేపథ్యంలో ఉంటుంది. ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని పొందింది.

Ads

4)మంత్ర :
ఛార్మి ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాలోని ‘మాహ.. మాహ’ పాట ఆరోజుల్లో పెద్ద సెన్సేషన్ సృష్టించింది చేసింది. ఈ సినిమా హిట్ అయ్యింది.ఈ సినిమాకి దర్శకుడు ఓషో తులసి రామ్.5) అనుక్షణం :
రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో మంచు విష్ణు హీరోగా వచ్చిన ఈ సినిమా సైకో కిల్లర్ నేపథ్యంలో రూపొందిన సినిమానే. అయితే సినిమా బానే ఉంటుంది కానీ పెద్దగా సక్సెస్ కాలేదు.6) క్షణం :
అడివి శేష్ హీరోగా క్రైమ్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాగా రూపొందింది. ఈ సినిమా హిట్ అందుకుంది.7) స్పైడర్ :
ఈ సినిమా గురించి తెలుగు ఆడియెన్స్ అందరికి తెలిసే ఉంటుంది. ఎందుకంటే ఇది మహేష్ బాబు నటించిన సినిమా. అయితే మహేష్ బాబు ఇమేజ్ కు కథ సెట్ అవ్వకపోవడంతో ఈ మూవీ డిజాస్టర్ అయ్యింది.

8) సవ్యసాచి :
నాగ చైతన్య హీరోగా సైకో కిల్లర్ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమాలో లాజిక్స్ కన్విన్సింగ్ గా ఉండకపోవడం వల్ల సినిమా పరాజయం పొందింది.

9) రాక్షసుడు:
బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా వచ్చిన ఈ సినిమా తమిళంలో హిట్ అయిన ‘రాట్ససన్’కు రీమేక్. ఇది కూడా సైకో థ్రిల్లర్ మూవీనే. మంచి సక్సెస్ ను అందుకుంది.

10) హిట్2
ఇటీవలే వచ్చిన ఈ సినిమాలో అడివి శేష్ హీరోగా ‘హిట్’కి సీక్వెల్ గా తెరకెక్కిన ఈ సినిమా సైకో థ్రిల్లర్ మూవీ. శైలేష్ కొలను ఈ మూవీకి దర్శకుడు. విడుదలైన రోజునుండి పాజిటివ్ టాక్ తో నడుస్తోంది.

Previous articleకాంతార సినిమాకి సాయి ధరమ్ తేజ్ ”విరూపాక్ష” సినిమాకి మధ్య లింక్ ఏమిటి..?
Next article”బ్ర‌హ్మంగారి కాల‌జ్ఞానం” లో చెప్పినట్టు గానే ఇలా జరిగింది..చూస్తే మీరూ షాక్ అవుతారు..!
Hai this is Kavitha. Cover the media industry. I write on the Movies, TV channels, OTT platforms and anything that is a medium for content distribution.