ఇవివి సత్యనారాయణ కుమారుడు ఆర్య‌న్ రాజేష్ పెళ్లి చలపతి రావు ఎందుకు జరిపించారు..?

Ads

సీనియర్ నటుడు చలపతి రావు మరణించడంతో టాలీవుడ్ లో విషాద ఛాయలు అలుముకున్నాయి. మీడియాలోను, సోషల్ మీడియాలోను ఇలా ఎక్కడ చూసిన చలపతి రావుకు సంబంధించిన వార్తలే షికారు చేస్తున్నాయి. అంతగా ఆయన అందరితోను మంచి అనుబంధాన్ని ఏర్పరచుకోవడం అనేది చిన్న విషయం కాదు.

కొంతమంది గొప్ప పనులు అయితే చేస్తారు.కానీ గొప్పగా అయితే బ్రతకలేరు. నటుడు చలపతి రావు చాలా గొప్ప మనిషి మత్రమే కాదు, గొప్పగా బ్రతికాడు. అలాగే మరణించడం కూడా అందరిని ఆశ్చర్య పరిచింది. ఇక చలపతి రావు గురించి ఇంతగా చెప్పడానికి కూడా కారణం ఉంది. అదే ఆయనలోని మంచి తనం. చలపతి రావు ఎన్టీఆర్ తనకు గాడ్ ఫాదర్ వంటి వ్యక్తి అని ఇప్పటికే చాలా సార్లు ఇంటర్వ్యూలలో కూడా చెప్పారు. ఎన్టీఆర్ అనంతరం ఆయనలా చలపతి రావును ఆదరించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారా అంటే అది దర్శకుడు ఇవివి సత్యనారాయణ.

Ads

వీరిద్దరి మధ్య మంచి అనుబంధం ఉంది. సినిమాలతో మొదలైన ఈ బంధం పర్సనల్ లైఫ్ ని కూడా కలిపింది. చలపతి రావు,ఇవివి కుటుంబాలు చాలా క్లోస్ గా ఉండేవి. ఆ అనుబంధంతోనే చలపతి రావు కొడుకు రవి బాబు డైరెక్టర్ గా ఇవివి సత్యనారాయణ అబ్బాయి నరేష్ ని హీరోగా అల్లరి మూవీతో ఇండస్ట్రీకి పరిచయం చేసాడు. ఇక ఇవివి సత్యనారాయణ పెద్ద అబ్బాయి ఆర్యన్ రాజేష్ వివాహంను చలపతి రావు దగ్గరుండి జరిపించారు.
ఎందుకంటే అప్పటికే ఇవివి సత్యనారాయణ మరణించారు. దాంతో చలపతి రావు ఆర్యన్ రాజేష్ పెళ్లి బాధ్యతను తానే తీసుకున్నారు. తూర్పు గోదావరి జిల్లాకు చెందిన అమ్మాయితో ఎంగేజ్మేంట్ నుండి పెళ్లి వరకు అన్ని చలపతి రావు చూసుకున్నారు. ఇక అమ్మాయి ఊరు అయిన జేగురు పాడువాసులతో చలపతి రావుకు ఉన్న సంబంధాల వల్ల ఆర్యన్ రాజేష్ కి ఆ సంబంధం కుదిరింది. ఇక ఇవివి ఇంట్లో జరిగే దాదాపు అన్ని కార్యక్రమాలు కూడా చలపతి రావు దగ్గరుడి జరిపించారు.

Also Read: చిరంజీవి vs బాలకృష్ణ.. సంక్రాంతిబరిలో ఇప్పటిదాకా ఎవరు ఎక్కువ హిట్స్ ఇచ్చారో తెలుసా?

Previous articleకళ్యాణ్ దేవ్ ఇంట్రెస్టింగ్ పోస్ట్.. దాని గురించేనా?
Next articleటాలీవుడ్ నటుడు చలపతిరావు సినీప్రస్థానం ఇదే..
Hai this is Kavitha. Cover the media industry. I write on the Movies, TV channels, OTT platforms and anything that is a medium for content distribution.