Ads
ఆచార్య చాణక్యుడు తన ప్రత్యేకతలతో ప్రపంచ ప్రసిద్ధి చెందాడు. ఆయన్ని గొప్ప లైఫ్ కోచ్ గా పేరు పొందాడు. గొప్ప వ్యూహకర్త అయిన చాణక్యుడి కారణంగా నందవంశం నాశనమైంది. ఆయనకి రాజకీయాలు మరత్రమే కాకుండా సమాజంలోని అన్ని విషయాలపై చాలా జ్ఞానం ఉంది. చాణక్య నీతి శాస్త్రంలో ఆర్థిక, సామజిక, రాజకీయ తదితర విషయాలపై చాలా వివరంగా చెప్పాడు.
ఇక చాణక్య నీతిలో పురుషులకు, మహిళలు సంబంధించి నిర్దిష్ట విధానాలు వేరు వేరుగా ఉన్నాయి. మగవారు తమ గురించిన కొన్ని విషయాలను ఎల్లప్పుడూ రహస్యంగా ఉంచాలని చాణక్య నీతి చెప్తుంది. అలా చేయకపోతే పురుషులు జీవితాంతం సమస్యల్లో మునిగిపోవాల్సి వస్తుందని ఆచార్య చాణక్య చెప్పాడు.అవి ఏమిటో చూద్దాం..1.వ్యక్తిగత రహస్యాలు
మగవారు తమయొక్క వ్యక్తిగతమైన రహస్యాలను ఎవరికి ఏ సందర్భంలో అయిన సరే చెప్పకూడదు. వాటిలో కొన్నింటిని తమ స్నేహితులకి, కుటుంబ సభ్యులకు చెప్పకూడదు. ఇక తమ వ్యక్తిగత రహస్యాల ఎప్పుడైతే బయట పెడతారో అప్పటినుండి జీవితాంతం సమస్యలు ఎదురు అవుతూనే ఉంటాయి.2.ఆర్థిక పరిస్థితి
ఇక మగవారు వారి ఆర్థిక పరిస్థితుల గురించి ఎవరికి చెప్పకూడదు. సమస్యలను తీర్చుకోవడానికి డబ్బు చాలా ఉపయోగపడుతుంది. ఒక వేళ మీ దగ్గర డబ్బు ఎక్కువ ఉండి, మీ బంధువులకు తెలిస్తే దానిని దొంగిలించడానికి కానీ, హాని చేసి డబ్బును తీసుకునేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చాణక్యుడు హెచ్చరించారు.3.అవమానం
పురుషులు తమకు జరిగిన అవమానాన్ని ఎవరికీ చెప్పకూడదు. ఒకవేళ ఎదురైన అవమానం ఇతరులకు చెప్పినట్లయితే మీ ఆత్మ గౌరవానికి భంగం జరుగుతుంది. అందువల్ల పురుషులు ఎదురైన అవమానాల ఎలాంటివి అయిన వాటి గురించి స్నేహితులకు లేదా కుటుంబసభ్యులకు చెప్పకుండా తమలోనే దాచుకోవాలి.
4.బలహీనతలు
ప్రతి మనిషిలోనూ, వ్యక్తిత్వంలో బలహీనతలు, బలాలు కూడా ఉంటాయి. పురుషులు వారి బలహీనతల గురించి ఎప్పుడు కూడా ఎవరికి చెప్పకూడదు. అలా కాదని చెబితే ఎవరికి అయితే చెప్తారో వారే మీ బాలహీనతలను వాడుకొని మిమ్మల్ని ఉపయోగించుకుంటారు. హాని కూడా తలపెట్టే ప్రమాదం ఉంటుంది.
Ads
5.భార్యతో జరిగిన గొడవలు
భార్య భర్తలు అన్నాక గొడవలు సర్వసాధారణం. అయిన సరే గొడవ పడ్డ విషయాన్ని ఇతరులకు తెలియనివ్వవద్దు. అలాగే స్నేహితులైన కుటుంబంలోని వారికి అయినా భార్యాభర్తల మధ్య ఉండే వ్యక్తిగత విషయాలు చెప్పకూడదు. చెప్తే ఆ తరువాత మీరే అవమానాన్ని పొందాల్సి రావచ్చు రావచ్చు. అందులోనూ గొడవలు పడే భార్య భర్తలంటే ఎవరికి అయినా లోకువే. గౌరవం కూడా ఉండదు.
Also Read: గుండె పోటు రావడానికి అరగంట ముందు ఏం అవుతుందో తెలుసా..?