‘జబర్దస్త్’ షోతో సినిమాల్లో కంటే ఎక్కువ సంపాదిస్తున్న నటులు ఎవరో తెలుసా?

Ads

టెలివిజన్ లో ప్రసారమయ్యే జ‌బ‌ర్ద‌స్త్ కామెడీ షో గురించి పరిచయం చేయాల్సిన పని లేదు.ఎందుకంటే ఈ షో ప్రేక్షకులను ఎంతగా నవ్విస్తుందో, వారిని ఎలా ప్రభావితం చేసిందో అందరికి తెలిసిన విషయమే. ఇక జబర్దస్త్ షో వచ్చాక దాదాపు కామెడీ మూవీస్ కి వెళ్ళే జనాలు తగ్గారనే చెప్పాలి.

కామెడీనే నమ్ముకుని సినిమాలు చేసే శ్రీనువైట్ల వంటి డైరెక్టర్లు జాడ లేకుండా పోయారు. మాటల మాంత్రికుడు అని పిలుచుకునే త్రివిక్రమ్ కూడా హాస్యాన్ని పండించడానికి చాలా కష్టపడుతున్నాడనే చెప్పాలి. ఇది అంతా ఒక వైపు,ఇక మరో వైపు ఈ ఒక్క కామెడీ షోతో చాలా మంది హాస్య నటులు పరిశ్రమలోకి వచ్చారు. ఈ ఒక్క షో వల్ల చాలామంది జీవితమలో సెటిల్ అయిపోయారు.
ఎందుకంటే ఆఫీసులో అలిసి ఇంటికి వచ్చిన వారిని ఈ షో న‌వ్విస్తుంది. కొంతమంది ఆఫీసులో కూడా కాస్త టైమ్ దొరికినా ఈ షో చూస్తున్నారంటే, వారికి ఎంత రిలీఫ్ ను ఇస్తుందో అర్ధం అవుతుంది. నెటిజెన్స్ సోషల్ మీడియాలో కూడా ఈ షో డైలాగులను ట్రోలింగ్ కోసం వాడుతున్నారు.ఇక వెండితెర యాక్టర్స్ ఎంత సంపాదిస్తారో పూర్తిగా తెలియదు . కానీ జ‌బ‌ర్ద‌స్త్ షో యాక్టర్స్, యాంకర్లు బాగా సంపాదిస్తున్నారు. వాళ్ళ సంపాదన వివరాలు ఏమిటో చూద్దాం..

Ads

1. రష్మీ
ఎక్స్ ట్రా జబర్దస్త్ షోకి యాంకర్ చేసే రష్మీ గౌతమ్ ఒక ఎపిసోడ్ కు ఎనబై వేలు తీసుకుంటుందని సమాచారం. అంటే నెలకి రష్మీ 3.5 లక్షలు వరకూ అందుతుంది.
2. సౌమ్య రావు
జబర్దస్త్ యాంకర్ సౌమ్య రావు ఒక ఎపిసోడ్ కు 75 వేలు తీసుకుంటుంది. అంటే సౌమ్య సంపాదన నెలకు 3 లక్షలు వరకూ అందుతుంది.3.సుధీర్ : 3.5 లక్షలు వరకూ సంపాదిస్తున్నారట.4.గెట‌ప్ శ్రీను 2.5 నుంచి 3 ల‌క్షల వ‌ర‌కూ అందుకుంటున్నారట.5.ఆటో రాంప్ర‌సాద్ 2.5 నుంచి 3 ల‌క్షల వ‌ర‌కూ అందుకుంటున్నారట.6.అదిరే అభి 2 నుంచి 2.5 లక్షల వరకూ సంపాదిస్తున్నాడట.7.హైపర్ అది 3 లక్షల వరకూ తీసుకుంటున్నాడట.

8.రాకెట్ రాఘ‌వ 2.5 ల‌క్ష‌లు తీసుకుంటున్నారట.9.భాస్క‌ర్ అండ్ టీం 2 ల‌క్ష‌లు తీసుకుంటున్నారట.

10.చ‌లాకీ చంటి 2 ల‌క్ష‌ల వ‌ర‌కూ తీసుకుంటున్నారట.11.సునామీ సుధాక‌ర్ 1 ల‌క్ష‌ తీసుకుంటున్నారట.12.ముక్కు అవినాష్, కెవ్వు కార్తిక్ 1 ల‌క్ష‌ వరకూ తీసుకుంటున్నారట.

Also Read: ఎన్నారైల‌ను పెళ్లి చేసుకున్న 8 టాలీవుడ్ హీరోయిన్స్ ఎవరో తెలుసా?

Previous articleప్రాణ మిత్రులు అయినా ఈ 5 విషయాలు అస్సలు చెప్పకండి..
Next articleమహేష్ ‘ఒక్కడు’ మూవీలో ధర్మవరపు సుబ్రమణ్యం చెప్పే ఫోన్ నెంబర్ ఎవరిదో తెలుసా?
Hai this is Kavitha. Cover the media industry. I write on the Movies, TV channels, OTT platforms and anything that is a medium for content distribution.