Ads
డబ్బు సంపాదించాలనే ఆశ ప్రతి మనిషిలోనూ ఉంటుంది. కానీ ఆ కల అందరి విషయంలో నెరవేరదు. కొంతమంది మాత్రమే ఆ కలను సాకారం చేసుకుంటారు. తమ చుట్టూ ఉన్న పరిస్థితుల తగ్గట్టుగా ఆలోచించి, తమకున్న నైపుణ్యాలతో పనిచేస్తూ డబ్బును సంపాదించుకుంటారు.
అయితే ధనానికి అధిదేవత అయిన లక్ష్మి దేవి ఆశీర్వాదం ఏ మనిషికి అయితే ఉంటుందో వారి దగ్గర మాత్రమే డబ్బు నిలబడుతుందని నమ్ముతారు. ఆచార్య చాణక్యుడు ఇదే విషయాన్ని తను రాసిన కౌటిల్య అర్ధశాస్త్రంలో చెప్పారు. కష్టపడి పనిచేయడమే కాకుండా అలా పని చేయడంలో తాను చెప్పినటువంటి నియమాలను పాటించడం వల్ల లక్ష్మీ దేవి ఆనందపడుతుందని, అప్పుడు లక్ష్మీ దేవత అనుగ్రహం పొంది వారి జీవితం ప్రశాంతంగా, ఆనందం, క్షేమం, వారి అభివృద్ధిలో ఏ అడ్డంకులు రాకుండా ముందుకు వెళతారని తన గ్రంధంలో చాణక్యుడు వెల్లడించాడు. ఇక మనం సంపాదించిన డబ్బు మన దగ్గరే నిలవాలి అంటే కొన్ని నియమాలను ఖచ్చితంగా పాటించాలని చాణక్యుడు తెలిపాడు. మరి అవి ఏమిటో ఇప్పుడు చూద్దాం..
Ads
చెడు మార్గాల్లో సంపాదించిన డబ్బు..
సాధారణంగా డబ్బును లక్ష్మీ దేవి స్వరూపంగా చూస్తుంటారు. చెడు మార్గాల్లో డబ్బును సంపాదించే వారిపై ఆ లక్ష్మిదేవికి ఆగ్రహం వస్తుంది. వారి దగ్గర ఉండటానికి లక్ష్మిదేవి ఇష్టపడదు. అందువల్ల దొంగతనం, హత్య, దోపిడీ లేదా మోసం చేయడం లాంటి మార్గాల ద్వారా సంపాదించిన సొమ్ము ఎవరి చేతిలోనూ స్థిరంగా ఉండదు. ఇక చెడు మార్గాల్లో డబ్బును సంపాదించేవారు చివరికి ఒకరోజు పేదవారిగా మిగులుతారు.
అన్యాయంగా సంపాదించిన డబ్బు..
వేధించి తీసుకున్న డబ్బు, వడ్డీకి ఇచ్చే డబ్బు లేదా అమాయకులను మోసం చేయడం ద్వారా సంపాదించిన డబ్బు ఎప్పుడూ కూడా వారి చేతిలో నిలవదు. ఎందుకంటే అనైతికంగా సంపాదించే వ్యక్తులను లక్ష్మిదేవి అనుగ్రహించదు.
అందువల్ల మనిషి ఎప్పుడైనా సరే తన కష్టార్జితంతోనే డబ్బును సంపాదించాలని, ఎప్పుడు కూడా ఇంకోకరిని మోసం చేసి డబ్బు సంపాదించకూడదని చాణక్యుడు తెలియచేశాడు. కష్టపడి పనిచేయడం ద్వారా వచ్చే డబ్బు ఎప్పుడూ సంపాదించిన వ్యక్తితోనే ఉంటుందని, అలాంటి వారు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోరని తెలిపారు.
Also Read: ఈ 3 పరిస్థితులు ఎదురైతే.. దురదృష్టానికి సంకేతమే..!