అసలు ఇంతకీ ఈ ”రాధిక మర్చెంట్” ఎవరు..? ఆమె బ్యాగ్రౌండ్ ఏమిటి..?

Ads

ఇప్పుడు ఎక్కువగా ఎక్కడ చూసినా సోషల్ మీడియాలో రాధిక మర్చెంట్ పేరు విపరీతంగా వినపడుతోంది. రాధిక మర్చెంట్ పేరు ట్రెండింగ్ లో ఉంది. అసలు ఇంతకీ ఈ రాధిక మర్చెంట్ ఎవరు..? అనంత్ అంబానీని పెళ్లి చేసుకునే రాధిక మర్చెంట్ ఎక్కడ నుండి వచ్చారు..? అసలు ఈమె ఎవరు..? బ్యాగ్రౌండ్ ఏమిటి అనేది చర్చనీయాంశంగా మారింది.

మరి ఇక రాధిక మర్చెంట్ గురించి చాలా మందికి తెలియని ఆసక్తికరమైన విషయాలని ఇప్పుడు మనం చూసేద్దాం. రాధిక మర్చెంట్ తో అనంత్ అంబానీ ఎంగేజ్మెంట్ అతి ఘనంగా జరిగిన విషయం తెలిసిందే.

ముకేశ్ అంబానీ నీతా అంబానీలా చిన్న కొడుకే అనంత్ అంబానీ. రాధిక మర్చంట్ తో అనంత్ అంబానీ ఎంగేజ్మెంట్ అయింది. ఈ రాధిక మర్చెంట్ వీరేన్ మర్చంట్, శైల దంపతుల కుమార్తె. ముంబై లో వీరి ఎంగేజ్మెంట్ జరిగింది. కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధువుల సమక్షంలో ఈ జంట ఉంగరాలు మార్చుకున్నారు. అయితే ముకేశ్ అంబానీ కోడలు కనుక రాధిక మర్చంట్ పాపులర్ అయిపోయారు. వీరేన్ మర్చంట్ అంకోర్ హెల్త్ కేర్ సీఈవో. అనంత్ తో రాధిక కి చాలా కాలం నుండి ఫ్రెండ్షిప్ ఉంది. రాధికకి 24 ఏళ్లు. ఈమె భరతనాట్యం లో శిక్షణను పొందారు.

Ads

ముంబైలో రాధిక స్కూలింగ్ పూర్తి చేసుకున్నారు ఆ తర్వాత న్యూయార్క్ యూనివర్సిటీ నుండి పాలిటిక్స్ ఎకనామిక్స్ లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. 2017 లో రాధిక ఎగ్జిక్యూటివ్ గా పని చేశారు. రాధిక ఇష్టాల విషయానికి వస్తే.. ఈమె కి కాఫీ అంటే ఎంతో ఇష్టం అలానే ఆమెకి చదువుకోవడం, ట్రేకింగ్, స్విమ్మింగ్ చాలా ఇష్టమట. ఈమె ఇప్పుడు ఎన్జీవోలతో కలిసి సర్వీసులని అందిస్తున్నారు. చిన్న వయసు నుండే శాస్త్రీయ నిత్యం అంటే ఈమె కి చాలా ఇష్టం.

ఈమె ప్రముఖ డాన్సర్ అయిన భావన దాకర్ దగ్గర భరతనాట్యంలో శిక్షణ తీసుకున్నారు. జూన్ 5వ తేదీన ముంబైలోని జియో వరల్డ్ సెంటర్లో కార్యక్రమం జరిగింది అప్పుడు ఆ ప్రోగ్రాం కి ఎంతో మంది సెలెబ్రెటీలు హాజరయ్యారు. టాప్ స్టార్స్ అయినట్టు వంటి అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్, రన్వీర్ కూడా వచ్చారు. ఆ ప్రోగ్రాం లో రాధిక మర్చంట్ భరతనాట్యం చేశారు, ఆ వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Previous articleమెగాస్టార్ చిరంజీవి పెద్ద కూతురు సుస్మిత భ‌ర్త నేపద్యం ఏమిటో తెలుసా?
Next articleచేతిలో డబ్బు నిలువ ఉండకపోవడానికి కారణం ఏమిటో తెలుసా?