Ads
చంద్రబాబు నాయుడు ఒక ఇంటర్వ్యూలో తన పెళ్లినాటి సంఘటనని గుర్తుతెచ్చుకుంటూ పెళ్లి చేసుకుంటాను అన్నాను కానీ ఒక షరతు పెట్టాను అని చెప్పుకొచ్చారు. చంద్రబాబు నాయుడు, భువనేశ్వరి దంపతులు 1981 సెప్టెంబర్ 10న వివాహం చేసుకున్నారు. వీరి వివాహాం మద్రాస్‌లోని కళైవానర్ ఆరంగం ఆడిటోరియంలో ఘనంగా జరిగింది. పెళ్లి సమయానికే చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు.
ఎన్టీఆర్ భువనేశ్వరితో పెళ్లి అన్నప్పుడు వెంటనే ఒప్పుకోలేదట, కొంచెం బెట్టు చూపారట. ఎప్పుడైతే పెళ్లి చూపులకి అక్కడికి వెళ్లారో భువనేశ్వరితో ఇలా అన్నారట. నేను ఒక పల్లెటూరి నుంచి వచ్చిన వాడిని, మంత్రి పదవి వస్తే సరే సరి లేకపోతే తిరిగి పల్లెటూరికే వెళ్లిపోతాను అని చెప్పారట. దానికి భువనేశ్వరి, భర్త ఎక్కడ ఉంటే భార్య అక్కడే ఉండాలి అని మా నాన్నగారు నాకు నేర్పారు అని చెప్పారు. ఆ మాటలకి చంద్రబాబు నాయుడు ప్రేమలో పడిపోయారట.
Ads
కానీ ఈ పెళ్లికి ఒక చిన్న షరతు పెట్టారట. నాకు కట్న కానుకలు ఏమి అవసరం లేదు కానీ ఈ పెళ్లిని చాలా ఘనంగా చేయండి అని అడిగారట. దానికి ఎన్టీఆర్ చిత్తూరులో ఉన్న ప్రతి గడపకి శుభలేఖలను పంపారట. తమిళ, తెలుగు ఇండస్ట్రీలో సినీ ప్రముఖులని, ముఖ్యమంత్రులని, రాజకీయ నాయకులని పిలిపించి అనుకోని రీతిలో ఘనంగా పెళ్లి ఏర్పాటు చేశారట. ఎన్టీఆర్ గారికి ఒక మనిషిని పూర్తిగా చదవడం తెలుసు కొన్ని సార్లు ఒక మనిషితో మాట్లాడాలంటే నన్ను కూడా గది బయటకు పంపి మాట్లాడతారు అని నవ్వుతూ చెప్పారు.
కాంగ్రెస్ పార్టీలో ఉన్న చంద్రబాబు నాయుడు దాని తర్వాత తెలుగుదేశం పార్టీకి వచ్చారు. అప్పటికే తెలుగుదేశం లోకి వద్దాము అని అనుకోలేదట కానీ అనుకోని పరిస్థితుల వల్ల తెలుగుదేశంలోకి వచ్చి మంత్రి అయ్యారు. దాని తర్వాత సీఎంగా పనిచేసిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఈ విషయం గురించి గుర్తుతెచ్చుకుంటూ ఒక ఇంటర్వ్యూలో సరదాగా తన పెళ్లి షరతు గురించి చెప్పారు చంద్రబాబు నాయుడు.
పెళ్లి చూపులోనే చంద్రబాబు నాయుడు గారు మూడు విషయాలు చెప్పారంట. ఆర్డినరీ కుటుంభం, మంత్రి పదవి శాశ్వతం కాదు..మళ్ళీ విలేజ్ లైఫ్ కి కూడా పోవాల్సి రావచ్చు…ఫ్యూచర్ లో ఎలాంటి సమస్యలు వస్తాయి అనేది కూడా మాట్లాడారు అంట. దానికి భువనేశ్వరి గారు ఒప్పుకున్నారు అంట.