చిరంజీవి కార్లకి 111 నెంబర్ మాత్రమే ఎందుకు ఉంటుంది..? దాని కోసం ఎంత ఖర్చు చేస్తారో తెలుసా..?

Ads

టాలీవుడ్ కింగ్ మెగాస్టార్ చిరంజీవి అంటే తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశ వ్యాప్తంగా తెలియని వారంటూ ఎవరూ ఉండరు. 1978లో చిన్న నటుడిగా తన కెరీర్‌ను ప్రారంభించిన ఆయన కష్టపడి మెగాస్టార్‌గా ఎదిగాడు. అయితే తాజాగా చిరంజీవికి సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఎంతో హుందాగా ఉండే చిరంజీవికి నంబర్ల సెంటిమెంట్ ఉందని, తన కార్ల నంబర్ల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారని సినీ వర్గాలు తెలుపుతున్నాయి. అంతే కాదండి ఆయన గ్యారేజ్‌లో చాలా ఖరీదైన స్పోర్ట్స్ కార్లు కూడా ఉన్నాయి.

chiranjeevi car number

తన కుమారుడు రాం చరణ్, కోడలు ఉపాసనల కోసం ప్రత్యేకంగా రోల్స్ రాయిస్ స్పెషల్ ఎడిషన్ కారు బుక్ చేసి మరీ తెప్పించినట్లు తెలుస్తోంది. దీని ధర సుమారు రూ.8 కోట్లు ఉంటుందని సమాచారం. దీంతో పాటు చిరంజీవి దగ్గర మెర్సెడెస్ బెంజ్ G63 AMG కారు, ల్యాండ్ రోవర్ కంపెనీకి చెందిన రేంజ్ రోవర్ వోగ్ కూడా ఉన్నాయంట. ఇది పక్కన పెడితే.. ఖరీదైన కార్ల నుంచి స్పోర్ట్ బైక్​ వరకు లక్కీ నంబర్​ ఉండేలా చూసుకుంటున్న వారి సంఖ్య పెరుగుతోంది. కొంతమంది ప్రెస్టేజీ, క్రేజీ కోసమైతే.. మరికొంతమంది న్యూమరాలజీ ప్రకారం కొంటున్నారు.

Ads

ఈ ఫ్యాన్సీ నంబర్ కోసం ఎన్ని లక్షలైనా ఖర్చు పెట్టేందుకు వెనకాడటం లేదు. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి కూడా ఇదే విషయంలో వార్తల్లో నిలిచారు. అయితే చిరంజీవికి మాత్రం నంబర్ 1 సెంటిమెంట్ ఉందంట. దీంతో అతని కార్లకు ఎక్కువగా 1111 నంబర్ ఉంటుందని.. ఈ నంబర్ అతని ఇమేజ్‌ను కూడా సూచిస్తుందని ఆయన నమ్ముతారట. తాజాగా చిరంజీవి టాయోటా కంపెనీ కారు కొనుగోలు చేసి ఫ్యాన్స్ నంబర్ 1111 దక్కించుకున్నారు. అయితే తన కారుకి 1111 నంబర్ వచ్చేలా చిరు రూ.5 లక్షలు ఖర్చు చేసినట్లు సమాచారం.

ALSO READ : ఈ 7 మంది తెలుగు డైరెక్టర్ల కూతుర్లను ఎప్పుడైనా చూసారా.? వాళ్ళు ఏం చేస్తున్నారంటే.?

Previous articleఈ 7 మంది తెలుగు డైరెక్టర్ల కూతుర్లను ఎప్పుడైనా చూసారా.? వాళ్ళు ఏం చేస్తున్నారంటే.?
Next articleఒక సంవత్సరం కంటే తక్కువ వయసు ఉన్న పిల్లలతో తిరుమలలో దర్శనం ఎలా చేసుకోవాలో తెలుసా..?