ఈ 7 మంది తెలుగు డైరెక్టర్ల కూతుర్లను ఎప్పుడైనా చూసారా.? వాళ్ళు ఏం చేస్తున్నారంటే.?

Ads

ఒక చిత్రం జయా పజయాలు అనేవి పూర్తిగా దర్శకుడి పైనే ఆధారపడి ఉంటాయి. అందుకే దర్శకుడిని కెప్టెన్ ఆఫ్ దిషిప్ అని పిలుస్తూ ఉంటారు. తెలుగు సినీ పరిశ్రమలో ఎంతో మంది ప్రతిభావంతులైన డైరెక్టర్స్ ఉన్నారు. వారి గురించి ఆడియెన్స్ కి తెలిసినా, వారి ఫ్యామిలీ విషయాల గురించి అరుదుగా మాత్రమే తెలుస్తూ ఉంటాయి.

అయితే టాలీవుడ్ లో డైరెక్టర్స్ కూతుర్ల గురించి తెలుసుకోవడానికి ఎంతో మంది ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే కొందరు దర్శకులు కుమార్తెలుగా తెలిసినప్పటికి, వారు తమలో ఉన్న ప్రతిభతో ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు. అలా వారు తండ్రికి తగ్గ కుమార్తెలు అని అనిపించు కుంటున్నారు. మరి ఆ కుమార్తెలు ఎవరో చూద్దాం..
1. డైరెక్టర్ పూరీ జగన్నాథ్-పవిత్ర:
టాలీవుడ్ లో డేరింగ్ & డాషింగ్ డైరెక్టర్ అనగానే గుర్తొచ్చే పేరు పూరీ జగన్నాథ్.  ఆయన తొలి సినిమా బద్రీతో తనకంటూ ఒక మార్క్ ను క్రియేట్ చేసుకున్నారు. పూరీ జగన్నాథ్ కుమార్తె పవిత్ర. ఇప్పటికే కొడుకు హీరోగా డెబ్యూ చేసిన పూరీ, పవిత్రను కూడా పరిశ్రమకి  పరిచయం చేయడానికి రెడీ అవుతున్నాడు. పవిత్ర ప్రభాస్ బుజ్జిగాడు సినిమాలో బాల నటిగా కూడా నటించింది.

2.సుకుమార్ – సుకృతి వేణి:
డైరెక్టర్ సుకుమార్ పుష్ప సినిమాతో పాన్ ఇండియా డైరెక్టర్ అయ్యారు. ఆయన కుమార్తె సుకృతి వేణి చిన్న వయసులోనే సింగింగ్ టాలెంట్ ని కలిగి వుంది. ఆమె యూట్యూబ్ ఛానల్ ద్వారా ఆడియెన్స్ కి తన  ప్రతిభను చూపిస్తోంది.

Ads

3. డైరెక్టర్ తేజ – ఐలా:
దర్శకుడు తేజ కూతురు ఐలా తేజ ప్రస్తుతం అమెరికాలో బిజినెస్ అండ్ అడ్మినిస్ట్రేషన్ మాస్టర్స్ చేస్తుంది. ఆమె ఒకవైపు చదువుకుంటూనే మరో వైపు మంచి స్పీకర్ గా అమెరికాలో పలు కార్యక్రమాలలో పాల్గొంది.

4. గుణశేఖర్ – నీలిమ గుణ:
డైరెక్టర్ గుణశేఖర్ కి ఇద్దరు కూతుర్లు. ఆయన పెద్ద కుమార్తె నీలిమ గుణ ప్రొడ్యూసర్ గా మారింది. సమంత నటిస్తున్న శాకుంతలం చిత్రానికి నిర్మాతగా వ్యవహరించింది.

#5. వంశి పైడిపల్లి కూతురు ఆద్య

మహేష్ బాబు గారాల కూతురు సితార తో కలిసి వంశి పైడిపల్లి కూతురు ఆద్య యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తుంది . తనలో వున్నా టాలెంట్ ని సోషల్ మీడియా ద్వారా బహిర్ఙ్గతం చేస్తుంది .

#6. మారుతి కూతురు హియా

దర్శకుడు మారుతి సైతం తన ముద్దుల కూతురుని తన దర్శకత్వం వహించిన ప్రతి రోజు పండగే ద్వారా పరిచయం చేసాడు . అత్యంత త్వరలోనే పూరి స్థాయి నటీమణిగా మారుతుంది అనడంలో ఎం సందేహం లేదు అంటున్నారు ప్రేక్షకులు .

#7. రాజమౌళి కూతురు మయూఖ

రాజమౌళి కూతురు మయూఖ సైతం తన కుటుంబం లాగే తాను కూడా ఇండస్ట్రీ లోనే తన కెరీర్ ను ఆరంభిస్తారు అనడంలో ఎలాంటి సందేహం లేదు అని సినీ వర్గాలు అనుకుంటున్నాయి .

Also Read: ప్రేమికుడు మూవీ షూటింగ్ ను మధ్యలోనే ఆపాలని గవర్నర్ ఎందుకు వార్నింగ్ ఇచ్చాడో తెలుసా?

Previous articleఆసియా కప్ కు దూరం చేయడంతో …వేరే దేశం తరఫున ఆడనున్న ఇండియన్ క్రికెటర్ ఎవరో తెలుసా.?
Next articleచిరంజీవి కార్లకి 111 నెంబర్ మాత్రమే ఎందుకు ఉంటుంది..? దాని కోసం ఎంత ఖర్చు చేస్తారో తెలుసా..?