ఒక సంవత్సరం కంటే తక్కువ వయసు ఉన్న పిల్లలతో తిరుమలలో దర్శనం ఎలా చేసుకోవాలో తెలుసా..?

Ads

ఏడాది వయసులోపు పసిపిల్లలను తీసుకొని తిరుమలలో దర్శనానికి వెళ్లడం …. అది కూడా జనాలతో నిండిపోయిన క్యూలో వెళ్ళాలి అంటే ఎంతో కష్టం. తమ భక్తులకు అటువంటి అగచాట్లు కలగకూడదు అని టీటీడీ సంవత్సరం లోపు పిల్లలకు ప్రత్యేక ప్రవేశ దర్శనం కల్పిస్తున్నారు.

దీన్ని ఉపయోగించుకొని క్యూ లైన్ లో ,కంపార్ట్మెంట్లో వెయిట్ చేయాల్సిన అవసరం లేకుండా దర్శనానికి వెళ్లొచ్చు. అయితే ఈ పిల్లలతో ఎవరు వెళ్లొచ్చు ?ఎలా వెళ్లాలి? అనే విషయాలు తెలుసుకుందాం…

one year below child in tirumala

తిరుమలలో నిత్యం వచ్చే భక్తులకు ఉచిత దర్శనతో పాటు 300 రూపాయల ప్రత్యేక దర్శన, దివ్యదర్శనం, శ్రీవాణి ట్రస్ట్ దర్శనం , పలు రకాల సేవలు ఇలా ఎన్నో ఉన్నాయి. అయితే చంటి పిల్లలను తీసుకొని వచ్చే తల్లిదండ్రులకు ఉచితంగా…అది కూడా ఎటువంటి రద్దీ లేకుండా దర్శనం జరిగే వసతి తిరుమల తిరుపతి దేవస్థానం కల్పిస్తోంది.

సంవత్సరంలోపు పిల్లలతో వచ్చే తల్లిదండ్రులకు ఈ టీటీడీ అందిస్తున్న ఉచిత దర్శనం వర్తించాలి అంటే కచ్చితంగా బిడ్డ యొక్క ఒరిజినల్ బర్త్ సర్టిఫికెట్ తీసుకురావాల్సి ఉంటుంది. ఒకవేళ భర్త సర్టిఫికెట్ లేని పక్షంలో హాస్పిటల్లో ఇచ్చే డిస్చార్జ్ సమ్మరీ అయినా తేవాలి. అలాగే తల్లిదండ్రుల ఇద్దరి దగ్గర ఐడెంటిఫికేషన్ కార్డ్స్ ఉండాలి.. అంటే ఆధార్, ఓటర్ లేక పాన్ కార్డు వంటివి. సంవత్సరంలోపు పిల్లలకి నేరుగా దర్శనం కల్పించే ఈ వసతి ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు సుపథం కాంప్లెక్స్ దగ్గర మీ ఐడి ప్రూఫ్స్ చూపించి ఉపయోగించుకోవచ్చు.

ఇలా వెళ్లే దర్శనానికి తల్లిదండ్రులు ,సంవత్సరంలోపు బిడ్డతో పాటు 12 సంవత్సరాల లోపు మరో పాపా లేక బాబును కూడా అనుమతిస్తారు. అయితే మిగిలిన కుటుంబ సభ్యులను ఎవరిని అనుమతించరు. ఈ దర్శనం కోసం ముందుగా ఎటువంటి టికెట్స్ బుక్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఇది పూర్తిగా ఉచితం.. కానీ మిగిలిన దర్శనానికి వెళ్లే భక్తుల లాగానే ఇందులో పాల్గొనే వాళ్లు కూడా సంప్రదాయ దుస్తులను ధరించి తీరాలి.

Previous articleచిరంజీవి కార్లకి 111 నెంబర్ మాత్రమే ఎందుకు ఉంటుంది..? దాని కోసం ఎంత ఖర్చు చేస్తారో తెలుసా..?
Next article“విక్రమ్ ల్యాండర్ నాదే..!” అంటూ ప్రచారం చేశాడు..! కానీ ట్విస్ట్ ఏంటంటే..?