Ads
ఎటువంటి సినిమా బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలో టాప్ హీరోగా ఎదిగారు చిరంజీవి. ఈ క్రమంలో చిరంజీవి ఎన్నో ఒడిదుడుకులు చూసి ఉంటారు. కానీ అవన్నీ తట్టుకొని ఈ స్థాయిలో నిలబడ్డారు. ఇంత వయసు వచ్చినా సరే యంగ్ హీరోలకి పోటీగా సినిమాలు చేస్తున్నారు.
ఇప్పటికి కూడా తన అభిమానులని సంతృప్తి పరచడానికి తన వంతు కృషి చేస్తున్నారు. వయసు అనే విషయాన్ని మర్చిపోయి తన ఫ్యాన్స్ తన నుండి ఏం కోరుకుంటున్నారో సినిమాల్లో అదే ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నారు. చిరంజీవి కంటే ముందు ఇండస్ట్రీలో ఎంతో మంది హీరోలు ఉన్నారు.
చిరంజీవి తర్వాత కూడా ఇండస్ట్రీకి ఎంతో మంది హీరోలు వచ్చారు. కానీ ఇన్నేళ్లుగా కూడా తన స్థానాన్ని ఎవరు అందుకోలేకపోయారు. అందుకు కారణం చిరంజీవి ఇప్పటికి కూడా చేస్తున్న కృషి. ఆయనలో ఉన్న పట్టుదల ఇప్పటికి కూడా మంచి సినిమాలు అందించేలాగా చేస్తోంది. అయితే చిరంజీవి పదవ తరగతి సర్టిఫికెట్ ఒకటి ఇప్పుడు బయటికి వచ్చింది. వెస్ట్ గోదావరి జిల్లాలో చిరంజీవి చదువుకున్నారు. చిరంజీవి పేరు ఇందులో కె ఎస్ ఎస్ వరప్రసాదరావు అని ఉంది. ఈ సర్టిఫికెట్ లో ఉన్న వివరాలు ఇలా ఉన్నాయి.
# పేరు: కె.ఎస్.ఎస్. వర ప్రసాద రావు
# తండ్రి పేరు: వెంకట్రావు
# నేషనాలిటీ: ఇండియన్, హిందు, తెలుగు
Ads
# లింగం: పురుష
# పుట్టిన తేదీ: 22.08.1955
# పుట్టిన స్థలం: పెనుగొండ
ఇవి మాత్రమే కాకుండా ఇందులో చిరంజీవికి భుజం మీద పుట్టుమచ్చ ఉన్నట్టు కూడా రాసి ఉంది. అకాడమిక్స్ కి సంబంధించి ఈ సర్టిఫికెట్ ఇస్తారు అనే విషయాన్ని కూడా ఇందులో ఇచ్చారు. చిరంజీవి సినిమాలు మాత్రమే కాదు. చదువులో కూడా ముందుండేవారు. చదువు పూర్తి చేశాకే చిరంజీవి ఇండస్ట్రీలోకి వచ్చారు. సహాయ పాత్రల్లో కెరీర్ మొదలు పెట్టి తర్వాత విలన్ పాత్రలు చేసి పేరు పొందారు. తర్వాత హీరో పాత్రలు చేయడం మొదలు పెట్టారు.
ఇంక సినిమాల విషయానికి వస్తే, ప్రస్తుతం చిరంజీవి వశిష్ట దర్శకత్వంలో విశ్వంభర సినిమా షూటింగ్ పనిలో బిజీగా ఉన్నారు. ఈ సినిమాలో త్రిష హీరోయిన్ గా నటిస్తున్నారు. ప్రస్తుతం సినిమా షూటింగ్ దశలో ఉంది. ఎం ఎం కీరవాణి ఈ సినిమాకి సంగీత దర్శకత్వం అందిస్తున్నారు. సోషియో ఫాంటసీ జోనర్ నేపథ్యంలో ఈ సినిమా రూపొందుతోంది. ఈ సినిమా కోసం చిరంజీవి ప్రత్యేకమైన ట్రైనింగ్ కూడా తీసుకుంటున్నారు. అందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే చిరంజీవిని అభినందిస్తూ ఎన్నో కామెంట్స్ వచ్చాయి.
ALSO READ : ఓయ్ సినిమా రీ-రిలీజ్ సందడి అంతా ఒక ఎత్తు… ఈ అమ్మాయి డాన్స్ మరొక ఎత్తు..! ఈమె ఎవరో తెలుసా..?