అలీ ప్రేమకథ మరియు బ్రేకప్ గురించిన ఈ విషయాలు తెలుసా?

Ads

టాలీవుడ్ ప్రేక్షకులను తన కామెడీ టైమింగ్ తో అలరించి, ఎన్నో విజయాలను అందుకున్నాడు హాస్యనటుడు అలీ. ఈ మధ్యే అలీ పెద్ద కుమార్తె వైభవంగా వివాహం జరిగింది.

ఇక తన కుమార్తె పెళ్ళికి చేసిన ప్రతి దాన్ని అలీ భార్య జుబేదా తన యూట్యూబ్‌ చానెల్ లో అభిమానులతో పంచుకుంది. అయితే ఆ వీడియోస్ లో అలీ, జుబేదాలను చూసినవారు అంతా అన్యోన్య దాంపత్యం అంటే ఇలా ఉండాలని అంటున్నారు. కానీ అలీ జుబేదా కంటే ముందుగా వేరే అమ్మాయిని ప్రేమించారంట. ఈ విషయాన్ని అలీ తాజాగా అలీతో సరదాగా కార్యక్రమంలో బయట పెట్టారు. బయటపెట్టాడు.
అలీ ఆ విషయం గురించి చెప్తూ ‘ఆ సమయంలో నా ఏజ్ 17, మా ఇంటి దగ్గరే ఒక అమ్మాయి ఉండేది. ఆ అమ్మాయి కళ్లు బాగుంటాయి. ఆమెకు పొడుగైన జుట్టు ఉంటుంది. చాలా అందంగా ఉంది ఆ అమ్మాయి. నన్ను చూసినపుడు చిన్నగా నవ్వేది. అయితే ఒకరోజు ఆ అమ్మాయి వర్షంలో నడుచుకుంటూ తడుస్తూ వస్తుంటే, నేను వెళ్లి గొడుగు పట్టుకున్నాను. ఇలా మా ఇద్దరి మధ్య బాగానే ఉండేది. నాకు 21 సంవత్సరాలు వచ్చిన తరువాత మా అమ్మకు ఆ అమ్మాయి గురించి చెప్పి, తనకు తండ్రి లేరు, ఆమెనే పెళ్లి చేసుకుంటా అన్నాను. అప్పుడు మా అమ్మ ఒకే అంది.

Ads

కొన్ని రోజుల తర్వాత మా అమ్మ తమ్ముడితో కలిసి మూవీకి వెళ్ళింది.అయితే మా అమ్మ వెళ్ళిన థియేటర్‌కు ఆ అమ్మాయి తన ఫ్రెండ్స్ తో వచ్చింది. దాంతో మా అమ్మ ఆ అమ్మాయేవద్దని సీరియస్ గా చెప్పింది. ఇక ఆ తరువాత నేను ఆ అమ్మాయిని చూడలేదు. ఆ తరువాత పెళ్లి కోసం సంబంధాలు చూశారు. ఆ క్రమంలో ఒక అమ్మాయి రిజెక్ట్‌ చేయగా,నాకు కోపం వచ్చి ఆ ఫ్యామిలీలోని అమ్మాయినే పెళ్లి చేసుకుంటానని అమ్మతో చెప్పాను. దాంతో ఆ అమ్మాయి చెల్లి జుబేదాతో పెళ్లి జరిగింది అని అలీ తెలియచేశాడు. ప్రస్తుతం ఈ విషయాలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.

Also Read:యాక్టర్ సునీల్ భార్యను ఎప్పుడైనా చూశారా?ఈ ఫోటోలపై ఓ లుక్ వేయండి..

Previous articleటాలీవుడ్ నటుడు చలపతిరావు సినీప్రస్థానం ఇదే..
Next articleమసూద సినిమాలో నజియా క్యారెక్టర్ చేసిన అమ్మాయి ఎవరో తెలుసా?
Hai this is Kavitha. Cover the media industry. I write on the Movies, TV channels, OTT platforms and anything that is a medium for content distribution.