కొరటాల శివ డైరెక్షన్ చేసిన ఈ 4 సినిమాలలో ఉన్న కామన్ పాయింట్ ఏమిటో తెలుసా?

Ads

దర్శకుడు కొరటాల శివ తన సినిమాలలో కమర్షియల్ మరియు సోషల్ మెసేజ్ ఉండేట్టుగా చూసుకుంటాడు. కొరటాల శివ డైరెక్షన్ లో వచ్చిన సినిమాలలో ఆచార్య తప్ప అన్ని విజయవంతమైన సినిమాలే. ఈ ఒక్క మూవీ తప్ప అన్ని చిత్రాలు సూపర్ హిట్ అయ్యాయి.

కొరటాల శివ దర్శకత్వం వహించిన చిత్రాలలో ఒక కామన్ పాయింట్ వుంటుంది. అది ఏమిటంటే దాదాపుగా హీరోలుగా నటించిన అందరూ ఒక బ్యాగ్ వేసుకుని కనిపిస్తారు. సినిమా అంతటా కాకపోయినా ఏదో ఒక సన్నివేశంలో మాత్రం ఈ బ్యాగ్ హీరోలు వాడతారు. అంతే కాకుండా తాము ఉండే ఊరు నుండి వేరే ఊరుకి వెళ్ళడం, అక్కడే సినిమా స్టోరీ కొనసాగడం జరుగుతుంది. మరి ఏ హీరో ఏ సినిమాలో అలా బ్యాగ్ తో కనిపించారో ఇప్పుడు చూద్దాం..మిర్చి
కొరటాల దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో ప్రభాస్,అనుష్క హీరోహిరోయిన్లుగా నటించారు. ఈ సినిమాలో ప్రభాస్ ఎంట్రీ సన్నివేశంలో బ్యాగ్ పట్టుకుని కనిపిస్తాడు.

Ads

శ్రీమంతుడు
సూపర్ స్టార్ మహేష్ బాబు, శృతి హాసన్ హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా శ్రీమంతుడు. ఊరి దత్తత కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సినిమాలో మహేష్ బాబు కూడా బ్యాగ్ తో కనిపిస్తాడు.
జనతా గ్యారేజ్
జూనియర్ ఎన్టీఆర్, సమంత, నిత్య మీనన్ నటించిన మూవీ జనతా గ్యారేజ్. ఈ మూవీలో జూనియర్ ఎన్టీఆర్ బ్యాగ్ తో కనిపిస్తాడు.
ఆచార్య
మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ నటించిన ఈ సినిమాలో ఒక సన్నివేశంలో చిరంజీవి కూడా బ్యాగ్ పట్టుకుని కనిపిస్తారు.
Also Read: పవన్ కళ్యాణ్ ‘బాలు’ మూవీ హీరోయిన్ ప్రస్తుతం ఎలా ఉందో తెలుసా?

Previous articleహీరోయిన్ గా మారక ముందు సమంత ఎలా ఉండేదో తెలుసా?
Next articleకమల్‌ హాసన్‌ ‘విక్రమ్’ మూవీలో పనిమనిషిగా నటించిన ఆమె ఎవరో తెలుసా?
Hai this is Kavitha. Cover the media industry. I write on the Movies, TV channels, OTT platforms and anything that is a medium for content distribution.