Ads
దర్శకధీరుడు రాజమౌళి ఏ మూవీని తీస్తున్నా కూడా ఆ చిత్రం కోసం రాత్రి ఆనక పగలు అనకుండా చాలా కష్టపడుతుంటాడు. పర్ఫెక్షన్ కోరుకుంటాడు. అందువల్ల ఆయన తీసే ఒక్కో మూవీ కోసం రెండు,మూడు సంవత్సరాల సమయాన్ని తీసుకుంటాడు.
రాజమౌళి తాను పడిన కష్టానికి తగ్గట్టుగా ప్రతిఫలాన్ని కూడా సాధిస్తున్నారు. ఇక తనపై ఎన్ని నెగిటివ్ కామెంట్స్ వచ్చినా కూడా రాజమౌళి అనుకున్నట్టుగా సినిమాని తీసి క్రిటిక్స్ ను కూడా మెప్పిస్తున్నాడు. జక్కన్న మూవీ అంటే 1000 కోట్ల రూపాయల వసూళ్లు సాధించడం పక్క అని కామెంట్లు చేస్తున్నారు. దాన్ని RRR తో మరోసారి నిరూపించాడు రాజమౌళి. కానీ ఈ డైరెక్టర్ కి ప్రస్తుతం పోటీ పెరుగుతోంది. మరి దర్శకధీరుడుకే పోటీ ఇస్తున్న డైరెక్టర్లు ఎవరో చూద్దాం..
Ads
కన్నడ పరిశ్రమ నుండి KGF సిరీస్ తో ప్రశాంత్ నీల్, తాజా సెన్సేషన్ కాంతరతో రిషబ్ శెట్టి జక్కన్నకి గట్టి పోటీ ఇస్తున్నారు. కేజీఎఫ్2 మూవీ 100 కోట్ల బడ్జెట్ తో తీస్తే, రిషబ్ శెట్టి కాంతార మూవీ 16 కోట్ల రూపాయల బడ్జెట్ తో రూపొందింది. ఇక ఈ రెండు చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర చేసిన వండర్స్ తెలిసిందే. ప్రస్తుతం ఈ డైరెక్టర్ల ఫ్యూచర్ సినిమాలపై ఇప్పటికే అంచనాలు ఏర్పడ్డాయి.కోలీవుడ్ నుండి నుంచి శంకర్, లోకేశ్ కనగరాజ్ నుండి రాజమౌళికి గట్టి పోటీ ఉండనుంది. శంకర్ సినిమాలు ఈ మధ్య కాలంలో బాక్సాఫీస్ దగ్గర రికార్డ్స్ క్రియేట్ చేయకపోయినా కూడా రామ్ చరణ్ తో తీసే సినిమా శంకర్ కు తిరిగి క్రేజ్ తెస్తుందని అభిమానులు అనుకుంటున్నారు.ఇక లోకేశ్ కనగరాజ్ విజయ్ తో మాస్టర్, కార్తితో ఖైదీ, కమల్ హాసన్ తో విక్రమ్ సినిమాలతో ఆడియెన్స్ ను ఆకట్టుకున్నాడు. దీంతో ఈ దర్శకుడు చేయబోయే సినిమాలపై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి.ఇక మలయాళంలో డైరెక్టర్ జీతూ జోసెఫ్ విభిన్నమైన చిత్రాలను తీస్తున్నాడు.ఇతను కూడా రాజమౌళికి గట్టిగా పోటీ ఇస్తాడని అంటున్నారు. అయితే వీరిలో జక్కన మీద పైచేయి సాధించే దర్శకుడు ఎవరు అని చర్చ మొదలయ్యింది. అయితే రాజమౌళి లెవల్ కూడా రోజు రోజుకు పెరుగుతూ 200 కోట్ల రూపాయల పారితోషకం తీసుకుంటున్నాడు జక్కన్న.
Also Read: రీల్ గానే కాదు… రీయల్ గా కూడా ఈ 11 మంది హీరోలే..!