కరోనా తరువాత 2023 లో ఏం అవుతుంది..? ”బ్రహ్మం గారు కాలజ్ఞానం” లో చెప్పిన విషయాలు ఏమిటి..?

Ads

బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పినట్లుగా జరుగుతుంది. ఆయనకి ఉన్న అపారమైన జ్ఞానంతో భవిష్యత్తులో ఏం జరగబోతోంది ఎటువంటి మార్పులు రాబోతున్నాయి అనే విషయాలని చెప్పారు. ఇప్పటికే ఆయన చెప్పిన చాలా విషయాలు జరిగాయి. కాల క్రమంలో వస్తున్న మార్పులను చూస్తే బ్రహ్మం గారు కాల జ్ఞానం లో ముందే ప్రస్తావించారని తెలుస్తోంది.

ఇప్పుడు జరిగే చాలా విషయాలు చూస్తుంటే బ్రహ్మం గారు చెప్పిన మాటలే గుర్తు వస్తున్నాయి. కరోనా మహమ్మారి రావడం వలన మనం ఎంత గానో సతమతమయ్యాము.

కరోనా వలన చాలా మందికి తీవ్ర నష్టం కలిగింది. అయితే కరోనా మహమ్మారి గురించి కూడా బ్రహ్మంగారు ముందే హెచ్చరించినట్లు తెలుస్తోంది. ”కోరంకియను జబ్బుకోటిమందికి తగిలి, కోడిలాగ తూగిసచ్చేరయ” అని ఆయన కాలజ్ఞానం లో అన్నారు. ఈరోజు పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామీ వారు చెప్పిన విషయాలు ఏమిటి..? 2023 లో అవెంత దాకా పూర్తి అవుతాయి అనేది చూద్దాం. నిజానికి బ్రహ్మం గారు హేతువాదిగా ఉండేవారు. కానీ ఆయనని చూస్తే ఆధ్యాత్మిక వేత్త గా కనపడతారు. క్రీ.శ. 1622 క్రీ.శ. 1693 మధ్య ఈయన జీవించారు.

Ads

ఆయన కరోనా తరువాత కూడా భయంకరమైన పరిస్థితులు వస్తాయని.. అవి ఇంతటితో ఆగిపోవని ఆయన కాలజ్ఞానం లో వుంది. అయితే ఈ మధ్యనే బ్రిటన్ నుంచి కొత్త స్ట్రెయిన్ వ్యాపిస్తోంది మనం విన్నాం. ఇలా భయంకరమైనవి వింటున్నాం. ఓమిక్రాన్ వంటి ప్రమాదకరమైనవి కూడా మనం విన్నాం. కాశీలోని దేవాలయం 40 రోజులు క్లోజ్ చేస్తారని కూడా అన్నారు. అదీ జరిగింది. 1910 -12 మధ్యన గంగానదికి వరదలు వచ్చాయి. ప్రజలు ఎంతో ఇబ్బంది పడ్డారు. అలానే ఈయన వందల కొద్దీ రాళ్లు శ్రీశైలానికి దక్షిణం లోఎక్కువ మంది ప్రాణాలు కోల్పోతారన్నారు… పైగా ఎన్నో రాతి ముక్కలు ఆకాశం వైపు కి ఎగురుతాయన్నారు.

కామాక్షమ్మ వారి విగ్రహం నుంచి రక్తం కారుతుంది కూడా అన్నారు. కృష్ణానది నది మధ్య లో బంగారు రధం ఉంటుందని.. చూసిన వాళ్ళ చూపు దాని కాంతి వలన పోతుందన్నారు. భ్రమరాంబ ఆలయంలో మొసలి ఎనిమిది రోజులుండి మేకలాగ అరచి మాయం అయ్యిపోతుందన్నారు. కర్నూలు జిల్లా ఆదోని మండలంలో అయితే కప్ప కోడై కూస్తుంది అన్నారు, ఇలా జరిగితే అనర్దాలు వస్తాయట.

Previous articleరిటర్న్ తీసుకోకుండానే అమెజాన్ కొన్ని ప్రొడక్ట్స్ మీద రిఫండ్ ఎందుకు ఇస్తుంది…? లాజిక్ ఇదే..!
Next articleరాజమౌళికి పోటీ ఇచ్చే ఈ 5 మంది డైరెక్టర్లు ఎవరో తెలుసా?