వెయిటింగ్ లిస్టులో ఉన్న టికెట్ కన్ఫర్మ్ అవ్వాలంటే.. ఇలా చెయ్యండి.. పక్క బెర్త్ వస్తుంది..!

Ads

మనం ఒక్కొక్కసారి రైలు టికెట్లు ని బుక్ చేసుకున్న తర్వాత వెయిటింగ్ లిస్ట్ వస్తుంది. వెయిటింగ్ లిస్టు వచ్చిందంటే కన్ఫర్మ్ అవుతుందా లేదా అనేది మనకి తెలియదు. ఎవరైనా ప్రయాణికులు టికెట్ ని క్యాన్సల్ చేసుకుంటే వారి స్థానంలో మనకి సీటును కేటాయిస్తారు. కన్ఫామ్ అవుతుందా లేదా అనేది ఆఖరి వరకు మనకి తెలియదు. ముఖ్యంగా పండగ సీజన్ లేదంటే సెలవులు ఉన్నప్పుడు ఎక్కువగా ట్రైన్ టికెట్లు కన్ఫర్మ్ అవ్వవు. వెయిటింగ్ లిస్టులో పడతాయి. టికెట్ కన్ఫర్మ్ అవుతుందో లేదో కూడా తెలియదు అలాంటి సమయంలో టికెట్ కన్ఫర్మ్ అవ్వాలంటే ఇలా చేయండి.

ఇలా చేయడం వలన వెయిటింగ్ లిస్టులో ఉన్న టికెట్ కన్ఫర్మ్ అవుతుంది. బెర్త్ కూడా మీకు దొరుకుతుంది. రైల్వే శాఖ వికల్ప్ స్కీమ్ ని తీసుకువచ్చింది. దీని ద్వారా వెయిటింగ్ లిస్టులో ఉన్న టికెట్ ని కన్ఫర్మ్ చేసుకోవచ్చు. టికెట్ బుక్ చేసుకునే సమయంలో ఈ స్కీం ఆప్షన్ ని ఎంచుకుంటే అదే మార్గంలో ప్రయాణిస్తున్న వేరే రైళ్లలో మీకు బెర్త్ కల్పించే అవకాశం ఉంది.

Ads

వేరే రైళ్లలో బెర్తులు కనుక ఖాళీ ఉంటే అందులో ప్రయాణించే అవకాశాన్ని కల్పిస్తారు. వెయిటింగ్ లిస్టులో ఉన్నవాళ్లు ఈ ఆప్షన్ ని ఎంచుకుంటే కాళీ లేని రైలు దిగి సీటు ఖాళీగా ఉన్న రైలు ఎక్కి ప్రయాణం చేయొచ్చు. అలానే మరొక ఆప్షన్ ఉంది. అదేంటంటే ఆటోమేటిక్ అప్గ్రేడ్ అనే ఆప్షన్. ఈ ఆప్షన్ ని మీరు టికెట్ బుక్ చేసుకున్న సమయంలో సెలెక్ట్ చేసుకోవాలి. మీరు కనుక స్లీపర్ క్లాస్ ని బుక్ చేసుకున్నట్లయితే ఈ ఆప్షన్ ఎంపిక చేసుకోవడం వలన థర్డ్ క్లాస్ ఏసి, సెకండ్ క్లాస్ ఏసి, ఫస్ట్ క్లాస్ ఏసి భోగిల్లో బెర్తులు ఖాళీగా ఉంటే అవి మీకు ఇస్తారు.

ఈ ఆప్షన్ ని మీరు టిక్కెట్ బుక్ చేసుకునే ముందు ఎంచుకోవాలి. ఖాళీ బెర్తులతో ట్రైన్ వేస్ట్ గా వెళ్లిపోవడం ఎందుకని టికెట్ కన్ఫర్మ్ అవ్వని వాళ్ళ కోసం ఈ ఆప్షన్ ని రైల్వే శాఖ తీసుకువచ్చింది. అయితే వికల్ప్ స్కీం ఆప్షన్ ని ఎంపిక చేసుకుంటే ఖచ్చితంగా బెర్త్ వస్తుంది అనేది చెప్పలేము. ఎందుకంటే అది రైలు మార్గం, సమయం, అదే మార్గంలో వెళ్లే ట్రైన్లు బట్టి ఉంటుంది.

Previous articleకాంగ్రెస్ తీసుకున్న ఆ నిర్ణయంతో బీఆర్ఎస్ లో టెన్షన్ !
Next articleపెళ్ళిలో చదివింపులు ఎందుకు చదివిస్తారు..? కారణం ఏమిటి అంటే..?