పెళ్ళిలో చదివింపులు ఎందుకు చదివిస్తారు..? కారణం ఏమిటి అంటే..?

Ads

సాధారణంగా పెళ్లిళ్లు ఏమైనా జరిగినప్పుడు ఎన్నో బహుమతులను తీసుకువచ్చి ఇస్తారు అలానే కొంతమంది డబ్బులు చదివిస్తూ ఉంటారు. పైగా ఎవరు ఎంత డబ్బులు ఇస్తున్నారు అనేది కూడా ఒక వ్యక్తి అక్కడ కూర్చుని రాస్తూ ఉంటారు. అయితే పెళ్లిలో చదివింపులు ఎందుకు చదివిస్తారు.. దాని వెనుక ఉద్దేశ్యం ఏంటి అనే విషయాన్ని ఈరోజు మనం తెలుసుకుందాం…

ఇది వరకు నుండి కూడా ఈ సాంప్రదాయం ఉంది. పెళ్లికి వచ్చిన వాళ్ళు డబ్బులుని చదివించి వెళ్తూ ఉంటారు. డబ్బులని ఇస్తూ ఉంటారు. అయితే డబ్బులు ఎంత ఇచ్చారు అనేది చూసుకుని మళ్ళీ పెళ్ళికి వెళ్ళినప్పుడు దాని మీద కొంచెం ఎక్కువ వేసి ఇచ్చేస్తూ ఉంటారు.

ఇక మరి పెళ్లిలో చదివింపులు ఎందుకు చదివిస్తారు అనే విషయానికి వచ్చేద్దాం.. పూర్వ కాలంలో అయితే దగ్గర వాళ్ళు అమ్మాయికి కావలసిన వస్తువులని అమిర్చేవారు. లేకపోతే అమ్మాయికి ఇంతని కన్యాదాతకి ఇంత అని డబ్బులు వేసేవారు ప్రత్యేకంగా కన్యాదాత కి చదివింపులు ఇది వరకు రోజుల్లో ఉండేది. వాటిని పెళ్లి కోసం వాడేవారు. అలానే ఇది వరకు ఒక వ్యక్తి ఎవరైనా అందర్నీ సహాయం కోసం అడిగి తిరిగేవారు.

Ads

వచ్చిన డబ్బుల్ని పెళ్లికి వాడేవారు. అలా అప్పట్లో ఉండేది. డబ్బులు చదివించడం అంటే ఇంత డబ్బులు అందరికీ తెలియజేయడం అన్న మాట. కానీ ఈరోజుల్లో ఎవరికి నచ్చినట్లుగా వాళ్ళు గిఫ్ట్ లని కొనుగోలు చేసి ఇస్తున్నారు. ఇది వరకులా ఇప్పుడు వాళ్లు ఎంత ఇచ్చారు మనం ఎంత ఇవ్వాలి అని ఆలోచనలో ఎవరు లేరు.

మనకి వాళ్ళు సహాయం చేశారు మనం కూడా ఏదైనా ఇవ్వాలి అన్న తీరులో ఆలోచిస్తున్నారు తప్ప వాళ్ళు ఇంత ఇచ్చారు నేను ఇంత ఇవ్వాలి అనే పద్దతి లేదు. స్నేహితులందరూ కలిసి గిఫ్ట్ లని కొనుగోలు చేయడం వంటివి ఇప్పుడు ఎక్కువగా చేస్తున్నారు పూర్వకాలంలో డబ్బులు వెండి సామాన్లు ఇలాంటివి ఇచ్చేవారు కానీ ఇప్పుడు అలా లేదు.

 

Previous articleవెయిటింగ్ లిస్టులో ఉన్న టికెట్ కన్ఫర్మ్ అవ్వాలంటే.. ఇలా చెయ్యండి.. పక్క బెర్త్ వస్తుంది..!
Next articleబీసీలకు 50 శాతం రాజకీయ రిజర్వేషన్లు అధికారంలోకి వస్తే తొలగించిన 26 కులాలను తిరిగి జాబితాలో చేర్చుతామని కాంగ్రెస్ పార్టీ హామీ