Ads
టెక్నాలజీ పెరగడం వల్ల ఆధునిక జీవితం సామాన్యులకు కూడా వరంగా మారింది. పెరిగిన సాంకేతికత మంచిదైనప్పటికి దీనిలోనూ కొన్ని ప్రతికూలమైన అంశాలు ఉన్నాయి. ఉదాహరణకు భద్రత పరమైన విషయాల కోసం వాడే వాటిలో కెమెరాలు ముఖ్యమైనవి.
కానీ కొందరు వాటిని దుర్వినియోగం చేస్తూ వక్ర మార్గాలలో వాడుతున్నారు. ఇటీవల కాలంలో హోటల్ గదులలో సీక్రెట్ కెమెరాల గురించి కలవరపరిచే సంఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయి. అయితే దీనికి ఒక సులభమైన మార్గం ఉందని నిపుణులు చెబుతున్నారు. మీ ఈ దగ్గర ఉండే స్మార్ట్ ఫోన్ ను ఉపయోగించి సీక్రెట్ కెమెరాను గుర్తించవచ్చు. మరి స్మార్ట్‌ఫోన్ కెమెరాతో హోటల్ గదిలో దాచిన కెమెరాను ఎలా గుర్తించాలో ఇప్పుడు చూద్దాం..
1. ముందుగా గదిలో ఉన్న అన్ని లైట్లను ఆపివేయాలి. అంతేకాకుండా టీవీ, ల్యాప్‌టాప్ వంటి వాటిని కూడా స్విచ్ ఆఫ్ చేసి, కర్టెన్లు వేసి, ఆ గదిని పూర్తిగా చీకటిగా మార్చాలి.
2. సీక్రెట్ కెమెరాను ఫలానా చోట ఉందన్న అనుమానం ఉంటే, స్మార్ట్‌ఫోన్‌లో ఉండే కెమెరాను ఆన్ చేసి, అనుమానించిన వైపుగా పెట్టాలి. ఇది కుండీలు, గడియారాలు, అద్దాలు, బుక్‌కేసులు,షవర్‌హెడ్‌లు, కెమెరాను దాచగలగే ఏ వస్తువు అయినా లేదా సెట్టింగ్ లాంటివాటికి వర్తిస్తుంది.
3. అలా ఫోన్ కెమెరాను ఉంచినపుడు ఫోన్ డిస్‌ప్లేలో జాగ్రత్తగా ఏవైనా లైట్ బ్లిప్‌ల లాంటివి వస్తున్నాయో గమనించండి.
Ads
4. సీక్రెట్ కెమెరాల నుండి రిలీజ్ అయ్యే ఇన్‌ఫ్రారెడ్ లైట్ ను స్మార్ట్ ఫోన్ కెమెరా లెన్స్ నుండి చిన్న ఫ్లాష్‌ల వలె కనిపించవచ్చు. కెమెరా స్క్రీన్‌పై అలాంటి లైట్‌ని గమనిస్తే వెంటనే ఆ చోటుని బాగా పరిశీలించండి.అక్కడ సీక్రెట్ కెమెరాల కోసం వెతకాలి.
మొబైల్ ఫోన్ ఫ్లాష్‌లైట్ ద్వారా హోటల్ రూమ్ లోని సీక్రెట్ కెమెరాను కనుగొనవచ్చా?
ముందుగా అన్ని లైట్లను ఆపివేసి, రూమ్ మొత్తం చీకటిగా ఉందని నిర్ధారించుకోవాలి. స్మార్ట్ ఫోన్ ఫ్లాష్ లైట్‌ని రూంలోని వస్తువుల పై గురిపెట్టి, సీక్రెట్ కెమెరా లైట్ ప్రతిబింబాల కోసం గమనించాలి. సీక్రెట్ కెమెరాలోని లెన్స్ నిర్దిష్టమైన దిశగా లైటింగ్ ని ప్రతిబింబిస్తుంది. కాబట్టి నిశితంగా ఫోన్ ఫాష లైట్ ను కదుపుతూ ఏ దిశలో ఆ కాంతి ప్రతిబింబం కనిపిస్తుందో చూడాలి. ఆ ప్రతిబింబం కనిపించగానే అక్కడ రహస్య కెమెరాల కోసం వెతకాలి.
Also Read: ”బాత్ రూమ్ సింక్” కి ఎందుకు చిన్న రంధ్రాన్ని ఇస్తారు.. దీని వెనుక కారణం ఏమిటో తెలుసా..?