”బాత్ రూమ్ సింక్” కి ఎందుకు చిన్న రంధ్రాన్ని ఇస్తారు.. దీని వెనుక కారణం ఏమిటో తెలుసా..?

Ads

ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఇల్లులని ఎంతో అందంగా కట్టించుకుంటున్నారు. పైగా అన్ని సదుపాయాలు ఉండేటట్టు చూసుకుంటున్నారు. ఫైవ్ స్టార్ హోటల్ మాదిరి అందంగా అన్ని సదుపాయాలు ఇంట్లో ఉండాలని చూసుకుంటున్నారు. ఇది వరకు చాలా మంది బేసిగ్ గా ఇల్లు కట్టించుకుంటూ వుండే వారు.

ఈ మధ్యకాలంలో చాలా మంది ఖరీదు ఎక్కువైనా పరవాలేదు అందంగా ఉండాలని చూస్తున్నారు. హోటల్స్ లో ఉంటున్నట్లు అన్ని సదుపాయాలని పెట్టించుకుంటున్నారు.

వాష్ బేసిన్స్ నుండి ప్రతిదీ కూడా చక్కటి మోడల్స్ ని ఎంపిక చేసుకుంటున్నారు. వాష్ బేసిన్ అంటే గుర్తొచ్చింది వాష్ బేసిన్స్ కి రెండు రంధ్రాలు ఉంటాయి. మామూలుగా సింక్ లోపల ఉండే పెద్ద రంధ్రం వలన నీరు లోపలికి వెళ్తుంది. ఈ విషయం మనకి తెలిసిందే. కానీ ఇంకో చిన్న రంధ్రం ఉంటుంది కదా దాని వలన ఉపయోగం ఏమిటి..?

Ads

ఎందుకు వాష్ బేసిన్ కి ఎక్స్ట్రా రంద్రం ఉంటుంది. ఆల్రెడీ ఒక రంధ్రం ఉంది కదా.. దాని ద్వారా నీళ్లు వెళ్ళిపోతాయి. మళ్లీ ఇంకో రంధ్రం ఎందుకు ఇచ్చారు అన్న సందేహం మీకు ఉంటే వెంటనే క్లియర్ చేసుకోండి. ఈ రంధ్రాన్ని ఓవర్ ఫ్లో హోల్ అని అంటారు. మామూలుగా మనం ఒక్కొక్కసారి ట్యాప్ ఆపడం మర్చిపోతూ ఉంటాము. వాష్ బేసిన్ ట్యాప్ ని కనుక ఆపకపోతే సింక్ నిండిపోతుంది.

ఆ తర్వాత నీరంతా కూడా ఫ్లోర్ మీదకి వచ్చేస్తుంది. అయితే వాష్ బేసిన్ కి ఇచ్చిన ఇంకో రంధ్రం ఏం చేస్తుందంటే ఫ్లోర్ మీదకి నీళ్లు రాకుండా స్టాప్ చేస్తుంది. ఆ రంధ్రం ద్వారా నీళ్లు వెళ్లిపోతాయి. సింగ్ పైకి నీరు వచ్చేయకుండా అది చూస్తుంది. ఈ రంధ్రం ఉండడం వలన ఫ్లోర్ మీదకి నీరు రాదు ఈ సమస్య కలగకుండా ఉండాలని వాష్ బేసిన్ కి హోల్స్ ఇచ్చారు.

Previous articleఎందుకు ”కాయిన్స్” మీద గీతలు ఉంటాయి..? దాని వెనుక ఇంత పెద్ద కారణమా..?
Next article”సైకిల్ సీటు” మధ్యలో ఎందుకు ఇలా ఉంటుంది.. దీని వలన ఇంత ఉపయోగమా..?