Ads
ఆర్ఆర్ఆర్ సినిమా గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. దర్శకధీరుడు రాజమౌళి తెర మీదకి తీసుకొచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమా ప్రేక్షకుల్ని ఎంతగానో మెప్పించింది. RRR నుండి వచ్చిన నాటు నాటు పాటకి భారతీయ సినీ చరిత్రలో ఎప్పటికీ ఓ ప్రత్యేకమైన స్థానం ఏర్పడడం జరిగింది. నాటు నాటు పాట ఓ అద్భుతాన్ని సృష్టించింది. నామినేషన్స్ కి వెళ్లడమే కాకుండా ఒరిజినల్ సాంగ్ విభాగంలో 95వ ది అకాడమీ అవార్డుని సొంతం చేసుకుంది.
ఈ పాట కి ప్రేమ్ రక్షిత్ సినిమాటోగ్రఫీ కీరవాణి మ్యూజిక్ చంద్రబోస్ లిరిక్స్ ఇచ్చారు. నాటు నాటు పాటని కాలభైరవ, రాహుల్ సిప్లిగంజ్ పాడారు. రామ్ చరణ్ ఈ సినిమాతో గ్లోబల్ స్టార్ అయిపోయాడు. పైగా ఈ మూవీ లో రామ్ చరణ్, ఎన్టీఆర్ మధ్య సీన్స్ కూడ బాగుంటాయి.
Ads
ఇక ఇదంతా పక్కన పెడితే ఆర్ ఆర్ ఆర్ సినిమాలో దోస్తీ పాట మీకు గుర్తుందా..? ఈ పాట లో ఒక సీన్ జరుగుతూ ఉంటుంది. కొమరం భీం పాత్ర పోషించిన జూనియర్ ఎన్టీఆర్ మాంసాన్ని తీసుకుని ఈ సాంగ్ లో వెళుతూ ఉంటాడు. అప్పుడు అక్కడ రామరాజు నించుని ఉంటాడు రామరాజు బాబాయ్ భీమ్ ని చూస్తాడు. భీమ్ ఆ మాంసాన్ని తీసుకు వెళ్లి లోపల ఉన్న రాహుల్ రామకృష్ణ కి మాంసాన్ని ఇస్తాడు.
రాహుల్ రామకృష్ణ ఏం చేస్తాడంటే ఆ మాంసాన్ని తీసుకు వెళ్లి అక్కడ ఒక రంధ్రం ఉంటుంది అందులో పడేస్తాడు. అప్పుడు సౌండ్ వస్తుంది. అది మనం సినిమా చూసినప్పుడు మొదటి సారి గమనించి ఉండకపోవచ్చు కానీ అప్పుడే పులి సౌండ్ వినపడుతుంది. అంటే ఈ లెక్కన చూస్తే భీమ్ అప్పటి నుండే జంతువులన్నిటికీ ఆహారం పెట్టి వాటిని దాడి కోసం తయారు చేస్తున్నాడు. దోస్తీ పాటలో ఇంత సీన్ జరుగుతుంటుంది. మరి మీరు ఈ సీన్ ని గమనించారా..?
video: