పూరి దర్శకత్వంలో వచ్చిన సినిమాల్లో.. హీరోయిన్స్ కంటే హైలైట్ అయిన 6 ఫిమేల్ రోల్స్..!

Ads

పూరి జగన్నాథ్ ఇప్పటికి చాలా సినిమాలని తెర మీద కి తీసుకువచ్చాడు. దర్శకుడు పూరి
జగన్నాధ్ టాలీవుడ్ లో డేరింగ్ అండ్ డాషింగ్ మాస్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు. ఏ హీరో అయినా కూడా పూరి సినిమా చేశాడంటే ఆటం బాంబులా మారిపోవడం పక్కా.

పూరి జగన్నాథ్ సినిమాల్లో హీరో హీరోయిన్ విలన్ మాత్రమే కాకుండా అంతకుమించిన పవర్ ఫుల్ క్యారెక్టర్లు కూడా ఎక్కువగా మనకి కనపడ్డాయి. మరి పూరి సినిమాల్లో హీరోయిన్ కంటే ఎక్కువ హైలెట్ అయిన ఫిమేల్ పాత్రల గురించి ఈరోజు చూద్దాం..

  1. కెమెరామెన్ గంగతో రాంబాబు:

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన కెమెరామెన్ గంగతో రాంబాబు సినిమాలో గంగ గా తమన్నా నటించింది. కానీ ఆమె రోల్ కంటే కూడా గుండక్క కారెక్టర్ డామినేటింగ్ గా ఉంటుంది.

2. అమ్మా నాన్న ఓ తమిళ్ అమ్మాయి:

రవి తేజ హీరోగా వచ్చిన అమ్మా నాన్న ఓ తమిళ్ అమ్మాయి సినిమా మీకు గుర్తు ఉందా..? ఈ సినిమా లో చూస్తే జయసుధ పాత్ర ఎక్కువ ప్రభావితం చేస్తుంది. ఆసిన్ కంటే కూడా జయసుధ పాత్ర డామినేటింగ్ గా ఉంటుంది. రవితేజ తల్లిగా జయసుధ ఎంతో చక్కగా నటించారు.

Ads

3. దేశముదురు:

దేశముదురు సినిమాకు పూరి ఏ దర్శకత్వం వహించారు. ఈ సినిమా లో హీరోయిన్ హన్సిక. అయితే ఈ మూవీ లో శివానీ క్యారెక్టర్ లో సన్యాసిగా ఉన్న కోవై సరళ అందరినీ ఆకట్టుకుంటుంది.

4. గోలీమార్:

గోపీచంద్ హీరోగా వచ్చిన గోలీమార్ లో కూడా అదే జరిగింది. గోలీమార్ లో ప్రియమణి హీరోయిన్ అయినా కూడా ప్రియమణి తల్లిగా చేసిన రోజా బాగా డామినేటింగ్ గా కనపడింది. అరుంధతి పాత్ర తో రోజా రఫ్ ఆడించేసింది.

5. లోఫర్:

లోఫర్ సినిమాకు పూరి దర్శకత్వం వహించగా వరుణ్ తేజ్ హీరోగా నటించాడు. దిశా పటాని ఈ సినిమా హీరోయిన్. అయినా కూడా వరుణ్ తేజ్ తల్లి పాత్ర చేసిన రేవతి డామినేటింగ్ గా వుంది. లక్ష్మమ్మగా ఆమె చక్కగా నటించింది.

6. లైగర్:

అలానే లైగర్ సినిమాలోనూ అదే జరిగింది. “ఒక లయన్ కి, టైగర్ కి పుట్టిండాడు. క్రాస్ బ్రీడ్ సార్ నా బిడ్డ” అని రమ్యకృష్ణ అంటుంది. పైగా హీరోయిన్ కంటే డామినేటింగ్ గా ఈమె కనపడింది.

 

Previous articleRRR సినిమా లోని “దోస్తీ” సాంగ్ లో.. దీన్ని మీరు గమనించారా..?
Next articleశివాలయంలో ప్రదక్షిణాలు ఎలా చెయ్యాలి..? చాలా మంది చేసే తప్పు ఇదే..!