Ads
సినిమాని తెర మీదకి తీసుకురావడం కోసం డైరెక్టర్లు ఎంతగానో కష్టపడుతూ ఉంటారు. పైగా డైరెక్టర్ ఏ సినిమా తీసినా కూడా ఆ సినిమా హిట్ అవుతుందనే తీస్తారు తప్ప ఆ సినిమా ఫ్లాప్ అవుతుందని ఎవరూ భావించరు. కొంతమంది డైరెక్టర్లు అసలు తిరిగే లేనట్లు ఒక ఫ్లాప్ ని కూడా ఎదుర్కోకుండా హిట్లతో దూసుకు వెళ్లిపోతూనే ఉన్నారు. మరి ఇండస్ట్రీలో ఫ్లాప్ లేకుండా హిట్లతో దూసుకు వెళ్లిపోతున్న డైరెక్టర్లు ఎవరనేది చూద్దాం..
1.రాజమౌళి:
బ్లాక్ బస్టర్ కి కేరాఫ్ అడ్రెస్ రాజమౌళి. రాజమౌళి ఒక ఫ్లాప్ కూడా లేకుండా హిట్లనే కొడుతూ వచ్చాడు. ఒక్క రాజమౌళి సినిమాలో అవకాశం వచ్చినా చాలని చాలామంది హీరోలు ఎదురుచూస్తున్నారు.
2.రాజ్ కుమార్ హిరానీ:
రాజ్ కుమార్ కూడా బ్లాక్ బస్టర్ లతో దూసుకువెళ్ళిపోయే దర్శకుడు. ఎప్పుడూ కూడా సినిమాలు ఫ్లాప్ కాలేదు. సూపర్ సక్సెస్ ని అందుకుంటున్న దర్శకుల్లో ఈయన కూడా ఒకరు.
3. అనీల్ రావిపూడి:
ఆరు సినిమాలకి దర్శకత్వం వహించారు అనీల్ రావిపూడి ప్రతి సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద హిట్టే అవుతోంది. రాజమౌళి తర్వాత డబల్ హ్యాట్రిక్ కొట్టిన వాళ్లలో అనిల్ రావిపూడి రెండో స్థానం లో ఉన్నాడు.
4. ప్రశాంత్ నీల్:
Ads
ప్రశాంత్ నీల్ కూడా పెద్ద పెద్ద సినిమాలని తెరమీదకి తీసుకొస్తున్నారు. మంచి హిట్ల ని అందుకుంటున్నారు. ప్లాపులు లేకుండా చూసుకుంటున్నారు ప్రశాంత్ నీల్ రాజమౌళి లాగే ప్రశాంత్ కూడా సూపర్ బ్లాక్ బస్టర్ లని ఇచ్చేలానే కనబడుతున్నారు.
5. కరణ్ జోహార్:
కరణ్ జోహార్ కూడా కేవలం హిట్స్ ని ఇచ్చాడు. కుచ్ కుచ్ హోతా హై, కబి కుష్ కభీ గం, మై నేమ్ ఇస్ కాన్, స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ మొదలైన సినిమాలకి దర్శకత్వం వహించారు ఈయన కూడా సూపర్ హిట్ లని అందుకుంటున్నాడు.
6. సందీప్ రెడ్డి వంగ:
ఇప్పటికి రెండు సినిమాలు చేశాడు తెలుగులో అర్జున్ రెడ్డి హిందీలో కబీర్ సింగ్. తెలుగులో హిందీలో కూడా ఫ్లాప్ రాలేదు. కేవలం సక్సెస్ ని అందుకున్నాడు.
7. వెట్రి మారన్:
ఈయన కూడా సూపర్ హిట్స్ ని అందుకుంటున్న డైరెక్టర్లలో ఒకరు మంచిగా సినిమాలని తెరమీదకి తీసుకువస్తారు. బాక్స్ ఆఫీస్ వద్ద ఈయనకి కూడా తిరుగు లేనట్లుగా ఆయన సినిమాలు ఉంటాయి.
8. మారి సెల్వరాజు:
ఇప్పటికీ మారి 2 సినిమాలకి దర్శకత్వం వహించారు అయితే రెండు సినిమాలు కూడా సూపర్ సక్సెస్ ని ఇచ్చాయి తప్ప ఏ మాత్రము నిరాశనివ్వలేదు.