సమంత తో పాటుగా.. ఈ 9 మంది హీరోయిన్లకు అభిమానులు గుడి కట్టారో మీకు తెలుసా…?

Ads

సమంతకి అభిమాని గుడి కట్టాడు అన్న వార్తను మీరు వినే ఉంటారు. అయితే సమంతకి మాత్రమే కాదు కొంతమంది హీరోయిన్ లకి కూడా ఇప్పటివరకు గుళ్ళు కట్టారు. సినిమాల్లో నటించే హీరో హీరోయిన్ల కి ఫ్యాన్స్ ఎక్కువమంది ఉంటారు. కొంతమంది మాత్రం వీరాభిమానులు అయిపోతారు. అలాంటప్పుడు గుడి కట్టడం వంటివి చేస్తూ ఉంటారు. కొంతమంది అయితే ఫేవరెట్ హీరో లేదా హీరోయిన్ పుట్టినరోజు నాడు అన్నదానం చేయడం రక్తదానం చేయడం వంటివి కూడా చేస్తూ ఉంటారు.

అభిమానుల మీద ప్రేమ ఎక్కువైతే ఇలాంటి పనులు చేస్తూ ఉంటారు. అయితే ఇప్పటివరకు ఎవరెవరికి గుడి కట్టారు అనేది చూద్దాం..

నిధి అగర్వాల్:

ఇస్మార్ట్ శంకర్ సినిమాతో ఫేమస్ అయిన నిధి అగర్వాల్ గురించి కొత్తగా పరిచయం చేయక్కర్లేదు. ఈమెకి తమిళ్లో ఫ్యాన్స్ ఎక్కువమంది ఉన్నారు. చెన్నైలో ఈమెకి గుడి కట్టారు.

నగ్మా:

అప్పటి హీరోయిన్స్ లో నగ్మా కూడా ఒకరు. ఈమె కూడా చాలా మంచి పేరు తెచ్చుకున్నారు. నగ్మా కి తమిళంలో విపరీతమైన అభిమానులు ఉన్నారు. తమిళనాడు వ్యాప్తంగా పలుచోట్ల ఆలయాలని కట్టారు.

పూజ ఉమా శంకర్:

ఇండో శ్రీలంక నటి ఈమె. పూజ ఉమా శంకర్ కి కూడా ఎక్కువగా తమిళ్లో ఫ్యాన్స్ ఉన్నారు ఈమె ఆరంజ్ సినిమాలో గెస్ట్ రోల్ చేశారు. శ్రీలంకలోని కొలంబోలో అభిమానులు అందరూ కలిసి ఒక ఆలయాన్ని కట్టారు.

హన్సిక:

హన్సిక కి కూడా గుడి కట్టారు. తమిళ్ లో కూడా ఈమె చాలా సినిమాలు చేసింది. చైల్డ్ ఆర్టిస్ట్ కింద ఈమె వచ్చినా కూడా తర్వాత పలు సినిమాల్లో హీరోయిన్ గా చేసింది. చెన్నై శివారులో ఒక విగ్రహాన్ని తయారుచేసి గుడి కట్టారు.

Ads

కుష్బూ:

కుష్బూకి కూడా ఒక ఆలయాన్ని కట్టారు. 1991లో కుష్బూ చిన్న తండ్రి సినిమా షూటింగ్లో ఉంది ఆమె కోసం అభిమానులు తిరుచిలో ఆలయాన్ని కట్టారు. అది విన్న కుష్బూ షాక్ అయ్యారు.

నమిత:

సొంతం సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది ఈమె. అయితే తెలుగులో అవకాశాలు రాకపోవడంతో ఈమె కోలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. కోయంబత్తూరు, తిరునవెల్లితో పాటు మొత్తం మూడు ఆలయాలని కట్టారు.

నయనతార:

ఈ లేడీ సూపర్ స్టార్ కి ఎంతమంది ఫ్యాన్స్ వున్నారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు ఆమె అభిమానులు ఆమె కి ఓ గుడి కట్టాలని అనుకున్నారు కానీ నయన్ మాత్రం అందుకు నిరాకరించారు.

కాజల్:

కాజల్ కి కూడా తన అభిమానులు గుడి కట్టబోయారు. తమిళనాడులోని ఒక ప్రాంతంలో ఆలయం సెట్ వేశారు. అందులో కొందరు అభిమానులు ఆమె కి గుడి నిర్మించాలని అనుకున్నారు. కాజల్ వారించడంతో ఆపేసారు.

సమంత:

ఏ మాయ చేసావే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు ఈమె పరిచయమైంది. సమంతకి ఆంధ్రప్రదేశ్ బాపట్ల జిల్లా చుండూరు గ్రామంలో ఒక అభిమాని ఆరు లక్షల రూపాయలు పెట్టి గుడి కట్టారు. ప్రస్తుతము ఈ వార్త సంచలనంగా మారింది.

Previous articleమెట్రో ట్రైన్ ట్రాక్ పై కంకర రాళ్ళు ఎందుకు ఉండవు..?
Next articleప్లాప్ లేకుండా హిట్స్ తో దూసుకు వెళ్ళిపోతున్న.. 8 స్టార్ డైరెక్టర్లు వీళ్ళే..!