Ads
చాలా మంది ఇల్లు కట్టుకునేటప్పుడు కానీ ఇల్లు పూర్తి అవ్వక ముందు కానీ లేదంటే ఇల్లు కట్టేసిన తర్వాత కానీ దిష్టి బొమ్మలని పెడుతూ ఉంటారు. అయితే మరి నిజంగా గుమ్మాలకి దిష్టి బొమ్మలని పెట్టుకోవాలా..? పెట్టుకుంటే సమస్యలు వస్తాయా..? లేదంటే దిష్టి బొమ్మలని ఇంట్లో ఉంచడం వలన మంచి కలుగుతుందా అనే సందేహం చాలా మందిలో ఉంది.
మీకు కూడా ఈ సందేహం ఉందా..? గుమ్మానికి దిష్టి బొమ్మలు పెట్టుకోవచ్చా పెట్టుకోకూడద అని.. మరి దాని కోసమే ఇప్పుడు చూద్దాం.
ఎక్కువగా ఇళ్ళని కట్టేటప్పుడు కొత్త ఇళ్లల్లో దిష్టి బొమ్మలని పెడతారు. కానీ అలా ఎప్పుడు చెయ్యకూడదు. ఎందుకంటే గృహలక్ష్మి మన ఇంట్లో ఉంటుంది. అటువంటప్పుడు ఇలా దిష్టి బొమ్మలు వంటివి పెట్టకూడదు. ఉదాహరణకి మనం ఏదైనా ఉత్సవాలు వంటివి జరిగి చోట ఇలాంటి దిష్టి బొమ్మలు వంటివి పెడితే ఎలా ఉంటుంది..? బాగోదు కదా.. అలానే గృహలక్ష్మి మన ఇంట్లో ఉంటుంది కనుక ఇక్కడ కూడా దిష్టి బొమ్మలను వుంచకూడదు. కనుక ఎప్పుడు కూడా ఈ తప్పు ని చెయ్యద్దు. అలానే ఎప్పుడైనా కూడా ఒక జట్టు వాళ్లంతా కూడా ఒక దిక్కున చేరుతూ వుంటారు.
Ads
మంచి వాళ్లంతా ఒక వైపు, చెడ్డ వాళ్లంతా ఒక చోటనే అలానే ఒకే ఫీల్డ్ కి చెందిన వాళ్ళు అంతా కూడా ఒక చోట ఇలా ఎవరికీ తగ్గ వాళ్ళు ఓ చోట కి చేరుతూ వుంటారు. అదే విధంగా మనం ఇంటి ముందు ఓ దేవుడి విగ్రహాన్ని పెట్టిన శంఖు చక్రాలని పెట్టిన పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయి. పైగా వచ్చిన వాళ్ళు నమస్కారం చేస్తారు. అయితే నరఘోష వంటివి ఎలా పోతాయి అనే సందేహం మీకు ఉండచ్చు. ఈ విషయానికి వస్తే నరఘోష వంటివి తొలగి పోవడానికి దిష్టి బొమ్మే అక్కర్లేదు. మంచిగా పంచముఖ ఆంజనేస్వామిని కూడా ఉంచచ్చు.