Ads
కోరా గురించి చాలామందికి తెలిసే ఉంటుంది. ప్రశ్నలు, సమాధానాల ద్వారా తమ అభిప్రాయాలను పంచుకునే ఒక వెబ్ సైట్. ఎవరు ఏ ప్రశ్నను అడిగినా, ఏ విషయం గురించి అడిగినా ప్రపంచంలో ఎవరో ఒకరు సమాధానం చెబుతుంటారు. ఇప్పటికే ఎంతోమంది కోరా ద్వారా ప్రశ్నలు, సమాధానాల చెబుతూ తమ అనుభవాలను షేర్ చేసుకుంటున్నారు. ఉంటారు. తాజాగా కోరాలో ‘హైదరాబాద్ లో పెరిగిన అమ్మాయిలని పెళ్ళి చేసుకోవటానికి వెనకాడుతున్నారు ఎందుకని’ అడిగిన ప్రశ్నకి ఒక యూజర్ ఏమని సమధానం చెప్పిందో ఇప్పుడు చూద్దాం..
Ads
“హైదరాబాద్ లో పెరిగిన అమ్మాయిలని పెళ్ళి చేసుకోవటానికి వెనకాడుతున్నారు. ఎందుకని” అనే ప్రశ్నకు అలోక్ నంద ప్రసాద్ “ఒక వేళ నిజంగా అలా జరుగుతుంటే అందుకు కారణాలుండకపోవు. హైదరాబాద్ అనే కాదు, ఏ పెద్ద పట్టణంలో పెరిగిన అమ్మాయి అయినా స్వతహాగా మిగతా అమ్మాయిలతో పోలిస్తే కాస్త ఎక్కువ ధైర్యంగా, స్వతంత్రంగా ఉంటుంది. తన బలాబలాలపై స్పష్టత, జీవనవిధానం గురించి అవగాహన ఎక్కువ. అక్కడి బడులు, కళాశాలలు, కార్యాలయాలు, దైనందిన జీవనంలో నెగ్గాలంటే ఆ ధైర్యం తప్పదు.
నిజానికది అందరమ్మాయిలకూ ఉండాల్సిన నిగ్గు. కానీ చిన్న ఊర్ల పరిమిత ఆలోచనా ధోరణులు, కట్టుబాట్లకు అలవాటు పడిన తల్లిదండ్రులు, వేసుకునే బట్టలు మొదలు స్నేహాలు, ఆశయాల వరకు అన్నిటా పిల్లలకు పరిమితులు విధిస్తూంటారు (కొన్ని తెలిసీ, ఎన్నో తెలియక). అవగాహన విస్తరించుకోనందున వారి పిల్లలకు (అబ్బాయిలకూ) అవసరమైన స్థైర్యం అలవడటం దాదాపు అసాధ్యం. పై చదువులకో, ఉద్యోగానికో వలసెళ్తే తప్ప ఆ పిడివాదపు సంకెళ్ళను తెంచుకోవటం సాధ్యపడదు. అప్పటికీ ఆ సంకెళ్ళను తెంచుకోనివ్వని తల్లిదండ్రులతో నరకయాతన పడే వ్యక్తులు ఎందరో తెలుసు. చిన్న ఊర్లలో అంతా ఇలాగే ఉంటారని కాదు కానీ బహుశా 80% ఇంతే.
ఇలా పెరిగిన అబ్బాయిలు పట్టణాల్లో పెరిగిన అమ్మాయిలను చేసుకోటానికి వెనుకాడటంలో ఆశ్చర్యం లేదు. వెనుకాడటం అంటే నిజానికి జంకటమేగా? చేతిలో చిల్లిగవ్వ లేనివాడు కోటి రుపాయల ఇల్లు కొనటానికి వెనుకాడటంలా, నెదర్లాండ్స్ జట్టు ఆస్ట్రేలియాతో టెస్ట్ మ్యాచ్ ఆడేందుకు వెనుకాడటంలాగానే అవతలి వ్యక్తి వ్యక్తిత్వం నా కంటే వికాసం చెందినదేమోనన్న సందేహంతో వెనుకాడటం ఉన్న మాట. కేవలం ఒక వ్యక్తి పెరిగిన ఊరిని బట్టి వారి వ్యక్తిత్వాన్ని అంచనా వేసి తీర్పునిచ్చే వారికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని లార్డ్ లబక్‌దాస్ ఎప్పుడో చెప్పారు” అని రాసుకొచ్చారు.
Also Read: ఒకే స్టడీ మెటీరియల్ చదివి, ఒకే ఏడాది, ఐఏఎస్ సాధించిన అక్కాచెల్లెళ్ళ సక్సెస్ స్టోరీ..!