Ads
చాలా మంది చేసే కొన్ని రకాల తప్పులు వల్ల ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. నిద్ర పోయినప్పుడు కూడా చాలా మంది కొన్ని రకాల తప్పులు చేస్తారు. మనిషి నిద్రపోయిన తర్వాత శవంతో సమానం అని పురాణాల ప్రకారం అంటూ ఉంటారు నిద్ర పోయినప్పుడు పంచేంద్రియాలు పని చేస్తేనే జీవంతో ఉన్నామని భావిస్తారు. అందుకే నిద్ర లేచాక శుభ్రంగా స్నానం చేయాలని పండితులు అంటారు.
ఆరోగ్యానికి నిద్ర ఎంతో ముఖ్యము. తీసుకునే ఆహారం ఎంత ముఖ్యమో మన ఆరోగ్యానికి నిద్ర కూడా అంతే ముఖ్యం. నిద్రపోయినప్పుడు మాత్రం కొన్ని వస్తువుల్ని అస్సలు మన దగ్గర ఉంచకూడదని పండితులు అంటున్నారు. మరి పండితులు చెప్పిన అద్భుతమైన విషయాలని ఇప్పుడు చూద్దాం.
Ads
- నిద్రించే సమయంలో మంచం దగ్గరికి అస్సలు వాలెట్ ను తీసుకురావద్దు. వాలెట్, పర్సు, డబ్బులు వంటివి మీ దగ్గర నిద్ర పోయేటప్పుడు ఉంటే ఇబ్బందుల్ని ఎదుర్కోవాలి. నిద్రపోయేటప్పుడు ఇలాంటివి మీ దగ్గర ఉండడం వలన డబ్బు ఉందనే భావన వస్తుంది. దానితో అశాంతి కలుగుతుంది.
- అలానే బెడ్ రూమ్ లోకి చెప్పులు వేసుకుని రాకూడదు. చెప్పులు, బూట్లు వంటివి తీసుకు వెళ్తే కూడా అశాంతి వస్తుంది. కనుక ఈ తప్పును కూడా చేయకండి.
- మొబైల్ ఫోన్ వంటివి కూడా మంచం మీద ఉంచకండి. ఇది ఆరోగ్యానికి ఎంతో ప్రమాదకరం.
- పుస్తకాలని న్యూస్ పేపర్లను కూడా తీసుకురావద్దు. ఇలా మంచం మీద పుస్తకాలని పేపర్లని ఉంచితే సరస్వతి దేవికి అవమానం జరిగినట్టే. కాబట్టి అసలు నిద్రపోయేటప్పుడు లేదా మామూలు సమయంలో కానీ బెడ్ రూమ్ లోకి లేదా బెడ్ మీదకి పుస్తకాలని న్యూస్ పేపర్లను మంచం మీద పెట్టద్దు. వీటి వలన అశాంతి కలుగుతుంది.
- అలానే చాలామంది అనేక రకాల ఇబ్బందులకు గురవుతూ ఉంటారు పాజిటివ్ ఎనర్జీ వచ్చి నెగటివ్ ఎనర్జీ తొలగిపోవాలంటే గదిలో కొంచెం ఉప్పుని ఒక మూల పెట్టండి. ఉప్పు నెగటివ్ ఎనర్జీని లాక్కొని పాజిటివ్ ఎనర్జీ ని ఇస్తుంది దీంతో మీకు మంచే కలుగుతుంది. కాబట్టి ఇలా అనుసరించి ఏ సమస్యలు లేకుండా ఉండండి ఆనందంగా జీవించండి.