పేపర్ లీక్ చేసిన ”రేణుక” బాక్గ్రౌండ్ ఏమిటి..? ఆమె గురించి చుట్టుపక్కల వాళ్ళు ఏం అంటున్నారు..?

Ads

తెలంగాణ లో పేపర్ లీక్ అయిన విషయం తెలిసిందే. కమిషన్ ఆఫీసు నుండి పేపర్లు లీక్ అయ్యాయి. దానికి సూత్రధారి రేణుకే. రేణుక సోదరుడు రాజేశ్వర్ టిటిసి పూర్తి చేశాడు. ఉద్యోగం రావాలని రేణుక అనుకుంది. ఆ కారణం గానే ఆమె ప్రవీణ్ ని కలిసి ప్రశ్నపత్రాలని అడిగింది. తమ్ముడు కోసం సంపాదించిన ఆ క్వశ్చన్ పేపర్స్ తో లక్ష రూపాయలని కూడా కాజేసింది.

పేపర్లు లీక్ చేసేందుకు పక్కా ప్లాన్ చేసింది. మహబూబ్ నగర్ జిల్లాకి చెందిన కొందరు యువకులతో 14 లక్షల కి ప్రశ్నపత్రాలని ఇచ్చేందుకు కూడా ఒప్పుకుంది. ఆఖరికి దొరికిపోయింది. ఇప్పుడు అసలు ఎవరు ఈ రేణుక అని అంతా ఆరా తీస్తున్నారు. మరి ఇక ఆమె బ్యాగ్రౌండ్ ఏమిటో చూద్దాం…

Ads

అసలు ఈ విషయాలు ఏమీ కూడా తెలియదని అంటున్నారు అభ్యర్థుల తల్లిదండ్రులు. రేణుక మహబూబ్ నగర్ జిల్లాకి చెందిన మహిళ. 2019లో గురుకుల ఎస్సీ బాలికల పాఠశాలలో ఈమె హిందీ పండిట్ టీచర్ గా ఉద్యోగాన్ని పొందింది. వనపర్తి జిల్లాలో ఈమె హిందీ టీచర్ గా పని చేస్తోంది. రేణుక సొంతూరులో మాత్రం ఈమె చాలా మంచిదని ఎప్పుడూ ఏ తప్పు చేయలేదని.. పెళ్లయిన తర్వాత కూడా రేణుక గురించి ఏమీ చెడ్డగా వినలేదని అంటున్నారు. భర్త పిల్లలు కూడా ఉన్నారు రేణుకకి. అయితే ఒక పక్క కుటుంబం ఉన్న కూడా తమ్ముడి కోసం అని ప్రవీణ్ తో బేరం పెట్టింది.

తమ్ముడికి పరీక్ష రాయడానికి అర్హత లేదని పోలీసులు గుర్తించారు. అలానే తాండాకి చెందిన శ్రీనివాసులు నాయక్ ఎస్ఐ పోస్టుకి ప్రిపేర్ అవుతున్నారు అతను ఒక కానిస్టేబుల్. రేణుక పేపర్ మీద ఆశ చూపించిన ఆయన వద్దని చెప్పేసాడు. కానీ పై అధికారులకు మాత్రం కంప్లైంట్ చేయలేదు దీనితో మిగిలిన పోలీసులు అతని మీద సీరియస్ అవుతున్నారు. కంప్లైంట్ చేయొచ్చు కదా అని అనుకుంటున్నారు. తమ్ముడు పేరుతో సెక్రెటరీ పిఏ ప్రవీణ్ సహాయం తీసుకునే లక్షల్లో వ్యాపారం చేసింది రేణుక. ప్రస్తుతం ఆమెని ఉద్యోగం నుండి సస్పెండ్ చేశారని తెలుస్తోంది.

Previous articleపండుగల పేర్లతో వచ్చిన 10 తెలుగు సినిమాల గురించి తెలుసా ? ఎన్ని ఉన్నాయి ? ఎప్పుడొచ్చాయి ?
Next articleనిద్రపోయేటప్పుడు అస్సలు ఈ 4 తప్పులని చెయ్యకండి… మీకే సమస్య..!