Ads
ఎన్టీ రామారావు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన తెలుగు సినిమాకి, తెలుగు జాతికి చేసినటువంటి సేవలను ఎప్పటికీ మరిచిపోలేరు. సాధారణ ఫ్యామిలిలో జన్మించిన ఎన్టీఆర్, కష్టపడి ఒక్కో మెట్టు ఎక్కుతూ సినీ పరిశ్రమలోనే నటసార్వబౌమునిగా ప్రత్యేక గుర్తింపును ఏర్పరుచుకున్నారు. రాముడైనా, కృష్ణుడైనా ఆయనే అన్నంతగా పేరు తెచ్చుకున్నారు.
ఆయన మాస్ చిత్రాలు చేసినా, క్లాస్ చిత్రాలు చేసినా కూడా ఆ చిత్రాలు విజయాలను సొంతం చేసుకున్నాయి. అంతేకాకుండా ఎన్టీఆర్ నటించిన చాలా చిత్రాలు సంవత్సరం పాటు ఆడిన రోజులు ఉన్నాయి. ఆయన ప్రజల శ్రేయస్సు కోరి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి, సంచలనం సృష్టించారు. ఆయన తెలుగు దేశం పార్టీని స్థాపించి కేవలం తొమ్మిది నెలల్లోనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే ఆయన పార్టీని స్థాపించి, పాలిటిక్స్ లోకి వచ్చిన సమయంలో ప్రధానిగా ఇందిరాగాంధీ పనిచేస్తున్నారు. ఆ సమయంలో దేశం మొత్తం కూడా ఇందిరా గాంధీ మాటను వినేవాళ్లు.
Ads
ఆమె కనుసన్నల్లో దేశాన్ని పాలిస్తున్న సమయం అది. అయితే ఆంధ్రప్రదేశ్ లో ఎలెక్షన్స్ సమయంలో జరిగిన ఒక ఇన్సిడెంట్ గురించి ఇప్పటికీ చెప్పుకుంటారు. రాష్ట్రమంతా ఎన్టీఆర్ పార్టీ ప్రచారం కోసం పర్యటిస్తున్న టైమ్ లో ప్రధానమంత్రి అయిన ఇందిరా గాంధీ ఏపీకి ప్రచారం చేయడం కోసం వచ్చారు. అప్పడు తిరుపతిలో ఇందిరాగాంధీ సభ జరుగుతున్న ప్రాంతానికి సమీపంలోనే ఎన్టీఆర్ సభకి అనుమతి ఇచ్చారు. కానీ ప్రధాని సభ జరుగుతుండడం వల్ల తిరుపతిలోకి ఎన్టీఆర్ ర్యాలీని, ఆయన వాహనాలను అధికారులు అనుమతించలేదట. ప్రధాని సభ పూర్తి కాబోయే సమయంలో ఎన్టీఆర్ వాహనానికి అనుమతి ఇచ్చారంట.
ఆ సమయంలో ‘చెయ్యేత్తి జై కొట్టు తెలుగోడా’ అనే సాంగ్ వినిపించగానే ప్రదాని ఇందిరా గాంధీ సభకి వచ్చిన ప్రజలందరు ఒక్కసారిగా పరుగు పెడుతూ అన్నగారి సభకి వెళ్లిపోయారంట. దాంతో ప్రదాని విషయం తెలుసుకుని, ఎన్టీఆర్ పై ప్రజలకు ఉన్న అభిమానాన్ని చూసి ఆశ్చర్యపోయారంట. ఎన్టీఆర్ తక్కువగా అంచనా వేశామని, ఎన్టీఆర్ రాష్ట్రం మొత్తం ప్రచారం చేయకుండా, వెంటనే ఎలెక్షన్ నోటిఫికేషన్ విడుదల చేసారనే వార్తలు అప్పట్లో వచ్చాయి.
Also Read: దేశంలో ముఖ్యమంత్రులలో ఎక్కువ జీతం తీసుకుంటున్న సీఎం ఎవరు తెలుసా?