“ఖుషి” ఫస్ట్ రివ్యూ వచ్చేసింది..! సినిమా ఎలా ఉందంటే..?

Ads

విజయ్ దేవరకొండ,సమంత కాంబోలో, శివ నిర్వాణ డైరెక్షన్ లో తెరకెక్కిన మూవీ ఖుషి. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ చిత్రం సెప్టెంబర్ 1 న విడుదలకు సిద్ధంగా ఉంది.

చాలా రోజులుగా మంచి హిట్ కోసం ఎదురు చూస్తున్నా సమంత, విజయ్ దేవరకొండ ఈ మూవీపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.

why did samantha not attending kushi promotions

ఈ నేపథ్యంలో విడుదల కాబోతున్న ఈ రొమాంటిక్ చిత్రంపై భారీ అంచనాలను నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ సాంగ్స్ మంచి రెస్పాన్స్ సొంతం చేసుకోవడంతో పాటు సూపర్ హిట్ గా నిలిచాయి. వీటితో పాటుగా ట్రైలర్ ,టీజర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఈ చిత్రం ఒకేసారి తెలుగుతో పాటుగా హిందీ ,తమిళ్ ,కన్నడ , మలయాళ భాషల్లో గ్రాండ్ లాంచ్ కు సిద్ధంగా ఉంది.

why did samantha not attending kushi promotions

Ads

అయితే ప్రస్తుతం ఒక మూవీ యొక్క సక్సెస్ లేక ఫెయిల్యూర్ అనేది చాలా వరకు సోషల్ మీడియా గాసిప్స్ పై ఆధారపడి ఉంది. ఈ నేపథ్యంలో విడుదలకు కొద్ది రోజుల ముందే ట్విట్టర్ మరియు ఇంస్టాగ్రామ్ లో ఫేక్ న్యూస్ ఇచ్చే ఒక వ్యక్తి తను ఓవర్సీస్ సెన్సార్ సభ్యుడిని అని చెప్పుకుంటూ ప్రతి సినిమా విడుదలకి హంగామా చేస్తాడు. అతను మరెవరో కాదు…ఫేక్ రివ్యూస్ కి ఫేమస్ అయినా ఉమైర్ సంధు.

umair sandhu review on kushi

తాజాగా ఇతను తన రైటింగ్ స్కిల్స్ ని కృషి రివ్యూ మీద కూడా చూపించాడు. ఈ మూవీ ఒక రొటీన్ మరియు బోరింగ్ లవ్ స్టోరీ అని రాసిన ఉమైర్.. సమంత పక్కన విజయ్ దేవరకొండ హీరోగా సెట్ కాలేదని. అతనికంటే సమంత చాలా పెద్దదిగా కనిపించిందని.. స్టోరీ నరేషన్ సాగదీసినట్లుగా ఉందని పేర్కొన్నారు. అంతేకాదు కృషి స్టోరీకి కేవలం రెండు పాయింట్ల రేటింగ్ ఇస్తున్నట్టు పీటర్ ద్వారా తెలిపాడు.ఉమైర్ సంధు రివ్యూస్ మరియు రేటింగ్స్ గురించి బాగా తెలిసిన వారు ఎవరు అతను రాసింది పట్టించుకోరు…కానీ పాపం తెలియని వారు మాత్రం ఇది నిజమే అని నమ్ముతారు.

Previous articleసీనియర్ ఎన్టీఆర్, ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ మధ్య చోటు చేసుకున్న ఈ సంఘటన గురించి తెలుసా?
Next article“ఛీ… ఛీ ఇదేం పని..?” అంటూ… “సీనియర్ డైరెక్టర్” పై కామెంట్స్..! ఏం జరిగిందంటే..?