“బేబి” తర్వాత… “వైష్ణవి చైతన్య” నటించబోతున్న సినిమాలు ఇవే..! లైనప్ మాములుగా లేదుగా..?

Ads

‘బేబి’ చిన్న సినిమాగా వచ్చి బాక్స్ ఆఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబట్టింది. ఇందులో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రలలో నటించగా.. ఈ మూవీ జులై 14న ప్రేక్షకుల ముందుకొచ్చింది.

ఇందులో హీరోయిన్‌గా చేసిన వైష్ణవి చైతన్య.. మొదటి సినిమాతోనే ఓవర్‌ నైట్‌ స్టార్‌‌గా పేరు సంపాదించుకుంది. అదేవిధంగా ఎప్పటినుంచో తెలుగు నుంచి హీరోయిన్లు రావడం లేదనే వార్తను సైతం వైష్ణవి తిప్పికొట్టింది. దీంతో ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో వైష్ణవి చైతన్య పేరు మార్మోగుతోంది.

అదే విధంగా ఈ బ్యూటీకి సోషల్ మీడియాలో విపరీతమైన ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది. టిక్ టాక్, ఇన్ స్టాగ్రామ్ రీల్స్‌తో మంచి క్రేజ్ తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ యూట్యూబ్, షార్ట్ ఫిలిమ్స్‌లో నటించింది. మొదట ‘అల వైకుంఠపురం’లో సినిమాలో అల్లు అర్జున్ చెల్లెల్లిగా కనిపించిన వైష్ణవి.. ఒక్కసారిగా బేబీ సినిమాలో హీరోయిన్‌గా నటించి తన నటనతో కట్టిపడేసింది.

Ads

vaishnavi chaitanya upcoming movies

బేబి సినిమా క్రేజీతో వరుస సినిమా ఆఫర్లు వస్తున్నాయి. తాజాగా ప్రముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ లో సినిమా చేసే అవకాశం కొట్టేసిందని, త్వరలోనే గీతా ఆర్ట్స్ లో వైష్ణవి సినిమా చేయనున్నట్లు తెలుస్తోంది. అదే విధంగా మరో మూడు సినిమాల్లో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సినీ వర్గాల్లో ఓ వార్త చక్కర్లు కొడుతోంది.

vaishnavi chaitanya upcoming movies

మరోవైపు పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వస్తున్న డబుల్ ఇస్మార్ట్‌లో వైష్ణవి నటించనుందని తెలుస్తోంది. అయితే ఇటీవలే హీరో రామ్ పోతినేని కూడా వైష్ణవి నటనను మెచ్చుకుంటూ బొకే పంపించిన సంగతి తెలిసిందే. కానీ వీటిపై ఇంకా అధికారిక ప్రకటన విడుదల కావాల్సి ఉంది. మరి భవిష్యత్తులో వైష్ణవి ఎలాంటి సినిమాల్లో కనిపిస్తుందో వేచి చూడాలి.

ALSO READ : డాడీ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు ఎలా ఉందో తెలుసా..?

Previous articleమన్మధుడు కామెడీ BGM ఒరిజినల్ అనుకున్నాం… కాపీ కొట్టారా..? DSP ఇలా చేశాడు ఏంటి..?
Next articleసీనియర్ ఎన్టీఆర్, ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ మధ్య చోటు చేసుకున్న ఈ సంఘటన గురించి తెలుసా?