Ads
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చినప్పటి నుండి ఎవరు, ఎప్పుడు, ఎందుకు పాపులర్ అవుతారో చెప్పలేము. అలానే ఆ మధ్యకాలంలో బాగా పాపులర్ అయ్యారు ‘జారు మిఠాయి’ పాడిన మహిళ.
Ads
ఆమె పాడిన ఈ జానపద గేయం సోషల్ మీడియాలో సెన్సేషన్ సృష్టించింది. ఇక సినీ సెలబ్రిటీల దగ్గర మామూలు జనం వరకు అందరూ ఈ పాట పై రీల్స్ చేశారు. అంత పాపులర్ అయ్యింది ఈ జారు మిఠాయి పాట. జిన్నా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు స్వయంగా ఒక మహిళను తన ఊరు నుంచి పిలిపించి మరి, ఆమెతో స్టేజి మీద ఈ పాటను పాటను పాడించారు.
ఇక అదే జారు మిఠాయి సాంగ్ ను జిన్నా సినిమాలో పెట్టారు. జారు మిఠాయి పాటలో మంచూ విష్ణు, సన్నీ లియోన్ నర్తించారు. అయితే జిన్నా చిత్రంలోని పాట అంతగా పాపులర్ కాలేదు. కానీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ స్టేజి మీద పల్లెటూరి మహిళ పాడిన జారు మిఠాయి పాట సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఆ పాటనే సెలెబ్రెటీల నుండి పిల్లల వరకు రీల్స్ చేస్తూన్నారు. ఇక జిన్నా మూవీ థియేటర్లలో విడుదల అయ్యి, ఇలా వచ్చి అలా పోయింది. కానీ జారు మిఠాయి పాట మాత్రం ఇంకా ఆడియెన్స్ నోళ్ళల్లో నానుతూనే ఉంది. అంతగా పాపులర్ అయ్యింది ఈ పాట.ఈ పాట పాడిన మహిళా పేరు భారతి. ఆమెను ఎన్నో చానల్స్ ఇంటర్వ్యూలు చేస్తూన్నారు. ఈ క్రమంలోనే భారతి ఈ పాట గురించి ఇంట్రెస్టింగ్ విషయాలను తెలియచేసింది. జారు మిఠాయి పాటకు ఉన్న అర్ధాన్ని తెలిపింది. జారు మిఠాయి అనేది అమ్మాయి పేరని, ఇక మొగ్గల కాలింగో అనే దానికి అబ్బాయిలు ఎవరూ తనను చూడట్లేదని అర్థం అని తెలిపింది. ఇంకా చెప్తూ జిన్నా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో స్టేజి పై పాట పాడిన తరువాత మోహన్ బాబు ఆమెకు యాబై వేల రూపాయలు ఇచ్చారని ఆనందంగా చెప్పింది భారతి.
Also Read: వాల్తేరు వీరయ్య సినిమా రివ్యూ.. మెగా మాస్ పూనకాలు లోడింగ్..