Ads
ప్రస్తుతం ఉన్న బిజీ లైఫ్ లో ఉద్యోగం చేసే చాలామందికి వంట చేయడం అనేది ఇబ్బందిగా మారింది. సమయం లేక పోవడం వల్ల కానీ, ఆఫీస్ కి వెళ్లాలన్న తొందరలో హడావుడిగా చేసే వంటలు అంత రుచికరంగా ఉండవు. దాంతో ఎక్కువ మంది బయట తినడానికే ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తున్నారు. కొంతమంది ఆఫీస్ కి వెల్లిన తరువాత ఆర్డర్ చేసుకోవచ్చు అనుకుంటున్నారు.
ఇక బయట ఫుడ్ కూడా టేస్టీగా ఉండడంతో చాలామంది దానికి మొగ్గు చూపుతున్నారు. ఆ ఫుడ్ తిని అనారోగ్య సమస్యలను కొని తెచ్చుకుంటున్నారు. వీటిలో పరోటాలను చిన్న పిల్లల దగ్గర నుండి పెద్దవారి వరకు చాలా ఇష్టంగా తింటూ ఉంటారు. అయితే మైదాపిండితో చేసిన ఈ పరోటాలను తినడం ప్రమాదం అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
Ads
తిన్న ఆహారం డైజెషన్ కావాలి అంటే ఆ ఆహారంలో పీచు పదార్థం తప్పనిసరిగా కొంచెం అయిన ఉండాలి. కానీ మైదాపిండిలో పీచు పదార్థం ఉండదు. అందువల్ల మైదాతో చేసిన పరోటాను జీర్ణం చేయాలంటే జీర్ణాశయం చాలా కష్ట పడాల్సి వస్తుంది. అది జీర్ణం కాకపోతే ఆరోగ్య సమస్యలు వస్తాయి. మరి పరోటా తినడం వల్ల ఏం జరుగుతుందో ఇప్పుడు చూద్దాం.
మైదా సరిగ్గా జీర్ణం కాకుండా పేగులకి పట్టుకుంటుంది. అక్కడ సూక్ష్మ క్రిములు ఉత్పత్తి అయ్యి, పేగులలో ఇన్ఫెక్షన్లు వస్తాయి. అంతేకాకుండా కిడ్నీలో రాళ్లు ఏర్పడుతాయి. గుండె జబ్బులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. పరోటా తినే మాహిళల్లో రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. మైదాలో పిండి పదార్థం మాత్రమే ఉండడం వల్ల పొట్ట కూడా వస్తుంది. మైదాపిండితో చేసిన పరోటా తినడం వల్ల శరీరంలో బ్లడ్ షుగర్ లెవల్స్ పెరిగే ప్రమాదం కూడా ఉంది. అలా పెరగడం వల్ల అధిక రక్తపోటు లాంటి ఆరోగ్య సమస్యలు వస్తాయి.
Also Read: రాత్రి సమయంలో చపాతీ తింటే మంచిదా? భోజనం తింటే మంచిదా? ఈ విషయంలో వైద్యులు ఏమంటున్నారంటే?