రైల్వే స్టేషన్‌ లో తీసుకునే ప్లాట్‌ఫామ్ టికెట్ గురించి ఈ విషయాలు మీకు తెలుసా?

Ads

సాధారణంగా బంధువులను కానీ, స్నేహితులను కానీ తీసుకురావడానికి లేదా వారిని డ్రాప్‌ చేయడం కోసం రైల్వే స్టేషన్‌కి వెళ్తాం. అలా వెళ్ళినప్పుడు ప్లాట్‌ఫామ్‌పై వేచి ఉండడానికి ప్లాట్‌ఫామ్‌ టికెట్‌ ను ఖచ్చితంగా తీసుకోవాలి. ఈ విషయం దాదాపుగా అందరికే తెలిసిందే.

Ads

కానీ ఆ ప్లాట్‌ఫామ్‌ టికెట్‌ ఎంత సమాయం వరకు ప్లాట్‌ఫామ్‌ పై ఉండవచ్చు అనేది చాలా మందికి తెలియక పోవచ్చు. ఆ టికెట్ తీసుకున్నవారు రోజంతా ప్లాట్‌ఫామ్‌ పై ఉండొచ్చా? ఒకవేళ ప్లాట్‌ఫామ్‌ టికెట్‌ తీసుకోకుండా ఉంటే జరిమానా విధిస్తారా? అది ఎంత విధిస్తారు? వీటికి ఏమైనా పాస్ లాంటివి ఉంటాయా అనేది ఇప్పుడు చూద్దాం..ఒకసారి ప్లాట్‌ఫామ్‌ టికెట్‌ కొన్న తరువాత రెండు గంటల పాటు ప్లాట్‌ఫామ్ పై ఉండవచ్చు. అందువల్ల టికెట్‌ కొనుగోలు చేసేటప్పుడు ఏ సమయంలో తీసుకుంటున్నాం అనేదాని పై దృష్టి పెట్టాల్సి ఉంటుంది. టికెట్ తీసుకున్న 2 గంటలు దాటిన కూడా ప్లాట్‌ఫామ్‌ పైనే ఉంటే తప్పక జరిమానా కట్టాల్సి వస్తుంది. ఇక రైల్వే వెబ్‌సైట్ erail.in లో ఉన్న ప్రకారంగా ప్లాట్‌ఫామ్‌ టికెట్ కేవలం 2 గంటల వరకు చెల్లుబాటు అవుతుంది. ఆ సమయం దాటిపోతే రైల్వే సిబ్బంది ఫైన్ విధించే అవకాశం ఉంది. ఇక ప్లాట్‌ఫామ్‌ టికెట్‌ల యొక్క ధర రైల్వే స్టేషన్‌ ఉన్న ప్రాంతాన్ని బట్టి మారుతుంది. టిక్కెట్ ధర దాదాపు 10-50 రూపాయల వరకు మారుతూ ఉంటుంది.
దీనికి గాను ఉచితంగా ఇచ్చే పాస్‌లు కొన్ని ఉంటాయి. ఈ ఉచిత పాస్‌లను సాధారణంగా కొన్ని రకాల ప్రభుత్వ ఉద్యోగులకు ఇస్తారు. అంటే పోస్టల్ సర్వీస్, పోలీసులు, ఆర్మీ, ప్రభుత్వ రైల్వే పోలీసు, రైల్వే కాంట్రాక్టర్లు, స్కౌట్ గైడ్ ఆర్గనైజేషన్ లో పనిచేసే ఉద్యోగులు అందరికి కూడా ఉచిత పాస్‌లను జారీ చేస్తారు. ఇక ప్లాట్‌ఫామ్‌ టిక్కెట్‌ కొనుగోలు చేయకుండా స్టేషన్ లో ఉంటే రైల్వే సిబ్బంది 250 రూపాయల వరకు కూడా జరిమానా వేస్తారు. ప్రయాణ టికెట్ లేదా ప్లాట్‌ఫామ్‌ టిక్కెట్ లేకుండా ప్లాట్‌ఫామ్‌ పై ప్యాసింజర్ కనుక పట్టుబడినట్లయితే వారు ప్రయాణించి వచ్చిన రైలు ఛార్జీకి రెండింతల ఫైన్ వేస్తారు.
అంతేకాకుండా ఒక్కరికి అడిగినన్ని ప్లాట్‌ఫామ్‌ టికెట్‌లను ఇవ్వరు. ఈ సంఖ్య ప్రతి రైల్వే స్టేషన్‌కు మారుతుంది. రైల్వే స్టేషన్‌ లో అందుబాటులో ఉన్నటువంటి స్థలం బట్టి ప్లాట్‌ఫామ్‌ టిక్కెట్‌లు ఇవ్వడానికి వారికంటు పరిమితి ఉంటుంది. ఆ పరిమితిని అనుసరించే ప్లాట్‌ఫామ్‌ టిక్కెట్‌లను ఇస్తారు. పరిమితి మించిపోతే ఒక్క టికెట్ కూడా ఇవ్వరు.

Also Read: రైలు బ్రేకుని ఎందుకు సడన్ గా వెయ్యరు..? ఇంత ప్రమాదం జరగవచ్చా..?

Previous articleపరోటాలు తినడం ఎంత హానికరమో తెలుసా?
Next articleప్రేమిస్తే హీరోయిన్ సంధ్య ఎలా ఉందో? ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా?
Hai this is Kavitha. Cover the media industry. I write on the Movies, TV channels, OTT platforms and anything that is a medium for content distribution.