ఆ మూవీ కోసం రెమ్యూనరేషన్ వద్దనుకున్న చిరు…అసలు మ్యాటర్ అదేనట…

Ads

టాలీవుడ్ లో ప్రత్యేకంగా ఇంట్రడక్షన్ అవసరం లేని పేరు మెగాస్టార్ చిరంజీవి. మూడు దశాబ్దాలుగా టాప్ స్టార్ గా కంటిన్యూ అవుతూ ఆరు పదుల వయసులో కూడా వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు చిరంజీవి. తనతో పాటు తన సోదరులను మరియు వారసులను కూడా ఇండస్ట్రీకి పరిచయం చేసి మెగా కుటుంబాన్ని సృష్టించాడు. పంచ్ డైలాగ్ దగ్గర నుంచి మాస్ యాక్షన్ వరకు.. చిరుకి తిరుగేలేదు. ఇక ఈ సంక్రాంతికి వాల్తేరు వీరయ్య రూపంలో చిరంజీవి సృష్టించిన సునామి అంతా ఇంతా కాదు.

ఆగస్టు 11న భోళాశంకర్ గా చిరు ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు. చిరంజీవికి రియల్ లైఫ్ హీరోగా మంచి గుర్తింపు ఉంది.. తన దగ్గరకు సహాయం కోరి వచ్చిన వారందరికీ తన శక్తి కొద్ది సహాయం చేయడం చిరంజీవికి ఎప్పటినుంచో అలవాటు. స్వసక్తితో కోట్ల ఆస్తి గడించిన ఇప్పటికీ ఎంతో సింపుల్ లైఫ్ స్టైల్ గడిపే చిరంజీవి ఎందరికో ఆదర్శప్రాయమైనవాడు. ఈ నేపథ్యంలో చిరంజీవికి సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Ads

చిరంజీవి భోల శంకర్ చిత్రం మెహర్ రమేష్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీలో తమన్నా హీరోయిన్గా నటిస్తుండగా కీర్తి సురేష్ చిరంజీవి చెల్లెలి పాత్రలో కనిపించనుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి వచ్చిన పాటలు మరియు ట్రైలర్ ప్రేక్షకులను ఓ రేంజ్ లో ఆకట్టుకున్నాయి. వీటితో రాబోయే చిత్రంపై అంచనాలు కూడా భారీగా పెరిగాయి.

భోళా శంకర్ చిత్రానికి చిరంజీవి ఎటువంటి రెమ్యూనరేషన్ తీసుకోవడం లేదట. ఇప్పటివరకు మెహర్ రమేష్ తెరకెక్కించిన ప్రతి చిత్రం నిర్మాతలకు డిజాస్టర్ గానే మిగిలింది. అందుకే ఈసారి చిరంజీవి రెమ్యూనరేషన్ తీసుకోకుండా ఒకవేళ మూవీ సక్సెస్ అయితే అందులో వాటా మాత్రం తీసుకుంటాడని తెలుస్తోంది. కొంతమంది ఇది ఎంతో తెలివైన డెసిషన్ అంటుంటే మరి కొంతమంది ఇది చిరంజీవి మంచి మనసు అని అంటున్నారు.

Previous articleమరి ఒక్క షాట్ కోసం అంత ఖర్చు అవసరమా …బ్రో..
Next articleభరత్ అనే నేను మూవీ లో శుభోదయం సుబ్బారావు ఎవరో మీకు తెలుసా?