Ads
ఇండియా ప్రపంచంలోనే 4వ అతిపెద్ద రైల్వే వ్యవస్థను కలిగి ఉంది. సుమారు 68,600 కిలోమీటర్లలో రైలు నెట్‌వర్క్ భారతదేశంలో ఉంది.
Ads
ఇక వరల్డ్ లోనే అతిపెద్ద రైల్వే వ్యవస్థ అమెరికాలో ఉంది. 2,50,000 కి.మీ. రెండవ స్థానంలో చైనా, మూడవ స్థానంలో రష్యా, ఇక నాల్గవ స్థానంలో భారతదేశం ఉంది. అయితే భారతీయ రైల్వే వ్యవస్థ గురించి ఆసక్తికర విషయాలు ఎన్నో ఉన్నాయి. భారతీయ రైల్వే వ్యవస్థ చరిత్ర చాలా పురాతనమైదిగా చెప్పవచ్చు. ఇండియన్ రైళ్లలో ప్రతిరోజూ లక్షలాది మంది ప్రయాణం చేస్తుంటారు. ఇక మన దేశంలో బ్రిటిష్ వారు రైలు మార్గాన్ని మొదలు పెట్టారు. అయితే ప్రతి ఒక్కరూ ఎప్పుడో ఒకసారైనా రైలులో ప్రయాణించే ఉంటారు.అయితే రైలు వేగం మధ్యాహ్నం కంటే రాత్రిపూట వేగం పెరుగుతుందని ఎప్పుడైనా విన్నారా? మీరు ప్రయాణించినపుడు అది గమనించరా? అయితే ట్రైన్స్ మధ్యాహ్నం కంటే రాత్రి సమయంలో ఎక్కువ వేగంతో నడుస్తుందని చాలా మందికి తెలిసే ఉంటుంది. అయితే రాత్రి సమయంలో ట్రైన్స్ అతివేగంతో నడపడం వెనుక కారణం ఏమిటో తెలుసా? దీని వెనుక ఉన్న కారణం గురించి చూద్దాం.ఇక రాత్రి సమయంలో ట్రైన్స్ వేగం వెనుక చాలా కారణాలు ఉన్నాయి. వాటిలో మొదటిది ఏమిటంటే రాత్రి సమయంలో ట్రైన్ ట్రాక్ పై కదలికల యొక్క పరిధి తక్కువగా ఉంటుంది.
రాత్రి అయితే ట్రైన్ ట్రాక్ పై జంతువులు, మనుషుల సంచారం ఉండదు. ఇక రాత్రి వేళల్లో ట్రాక్ పై దాని నిర్వహణ కు సంబంధించిన పనులు ఏమి జరగగవు. ఈ కారణం వల్ల రాత్రి సమయంలో ట్రైన్ వేగం ఎక్కువ. ఇక రాత్రి వేళల్లో రైలును నడపడం వల్ల ఉపయోగాలు ఏమిటంటే ఎక్కువ దూరం నుండి అయినా సిగ్నల్స్ కనిపిస్తాయి. రైలును నిలిపివేయాలా లేదా అనేది ట్రైన్ డ్రైవర్ (లోకో పైలట్) కి దూరం నుండే సులభంగా తెలిసిపోతుంది.దానివల్ల డ్రైవర్ ట్రైన్ వేగాన్ని తగ్గించాల్సిన పని ఉండదు.ఈ కారణంగానే రాత్రి సమయంలో రైలు అధిక వేగంతో నడుస్తుంది. అర్థం చేసుకోవచ్చు.
Also Read: కొత్తగా పెళ్లైన అమ్మాయిలు గూగుల్ లో ఏ విషయాల గురించి వెతుకుతున్నారో తెలుసా?