గోవిందుడు అందరివాడేలే మూవీలోని రామ్ చరణ్ చెల్లెలు ప్రస్తుతం ఎలా ఉందో? ఏం చేస్తుందో తెలుసా..?

Ads

చాలా సినిమాల్లో నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ లు చేసిన చాలా మంది ప్రస్తుతం హీరోలు, హీరోయిన్లుగా నటిస్తున్న సంగతి అందరికి తెలిసిందే. అయితే వచ్చిన అందరూ ఇండస్ట్రీలో పేరు తెచ్చుకోవడం లేదు. కొంతమంది ఒక్క సినిమాతోనే కనుమరుగు అవుతున్నారు.

Ads

డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన ‘గోవిందుడు అందరివాడేలే’సినిమా దాదాపుగా అందరికి గుర్తుండే ఉంటుంది. ఈ సినిమాలో రామ్ చరణ్ హీరోగా నటించారు. రామ్ చరణ్ ను కుటుంబ ప్రేక్షకులకు దగ్గర చేయాలని తీసిన ఈ సినిమా నిరాశ పరిచింది. అంతేకాకుండా రామ్ చరణ్ యాక్టింగ్ పై చాలా విమర్శలు వచ్చాయి. అయితే ఈ సినిమా కథ, కృష్ణవంశీ పాత చిత్రాలలాగే ఉంటుంది. ఈ మూవీలోని లొకేషన్స్, సాంగ్స్ ఆడియెన్స్ ని ఆకట్టుకుంటాయి. ఇక ఈ సినిమాలో చరణ్ కి తండ్రిపాత్రలో నటుడు రెహమాన్ చేసారు. ఆయన చెల్లెలిగా ముంబయి నటి నటించింది. ఈ మూవీ సమయంలో ఆమె వయసు పద్దెనిమిది ఏళ్లు, అయినా ఆయేషా సినిమాలో చిన్న అమ్మాయిలాగా కనిపిస్తుంది. ఆ అమ్మాయి పేరు అయేషా కాదుస్కర్. అయేషా చూడడానికి తెలుగు అమ్మాయిలా ఉంటుంది. అయితే ఆమె తెలుగు అమ్మాయి కాదు. ఆమె హృతిక్ రోషన్ హీరోగా నటించిన ‘అగ్నిపథ్’ సినిమాలో నటించింది. ఈ సినిమా కంటే ముందు ఆయేషా కొన్ని హిందీ సీరియల్స్ లో కూడా నటించింది. ఆ తరువాత 2014లో వచ్చిన రామ్ చరణ్ గోవిందుడు అందరివాడులే సినిమాలో నటించింది. ఈ మూవీ క్లైమాక్స్ లో ఆయేషా గురించి ఒక ఫైట్ ఉంటుంది.ఆ సినిమా తర్వాత అయేషా తెలుగు చిత్రాల్లో నటించలేదు. ప్రస్తుతం ఆమె బాలీవుడ్ చిత్రాల్లో నటిస్తూ వస్తోంది. ఇటీవల వచ్చిన ఆయుష్మాన్ ఖురానా డాక్టర్ జీ సినిమాలో కూడా నటించింది. అంతేకాకుండా అయేషా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. రోజు ఏదో ఒక ఫోటోను అభిమానులతో పంచుకుంటుంది. ఆ ఫోటోల్లో అయేషా గ్లామర్ ఫోజులు పెడుతూ ఆకట్టుకుంటుంది. అయితే గోవిందుడు అందరివాడులే సినిమాకి ఇప్పటి అయేషా సంబంధం లేని విధంగా ఆమె మారిపోయింది.

Also Read: కైకాల సత్యనారాయణ ఆస్తులు విలువ ఎంత ఉంటుందో తెలుసా?

Previous articleరైళ్లు మధ్యాహ్నం కంటే రాత్రి సమయంలోనే ఎందుకు వేగంగా వెళతాయో తెలుసా?
Next articleవాల్తేరు వీరయ్య, వీర సింహా రెడ్డి సినిమాలలో సంక్రాంతి బరిలో గెలిచే మూవీ ఏది?
Hai this is Kavitha. Cover the media industry. I write on the Movies, TV channels, OTT platforms and anything that is a medium for content distribution.