జూనియర్ ఎన్టీఆర్, మంచు మనోజ్ లలో ఉన్న సిమిలారిటీస్ ఏమిటో తెలుసా?

Ads

లోకంలో మనిషిని పోలినటువంటి మనుషులు ఉంటారని అంటుంటారు. అయితే అది వాస్తవమే అయినప్పటికీ, మూవీస్ లో చూసినట్టుగా ఒకే ఎత్తు, ఒకే కలర్ లో ఉండరు. ఇక ఒకరిని పోలి మరొకరు ఉండే అవకాశం ఉందిగాని, ఏడుగురు ఉంటారు అనే విషయానికి అయితే ప్రామాణికత లేదు.

కాకపోతేసడెన్ గా ఒకరిని చూసినప్పుడు మాత్రం ఇతను మనకు తెలిసన వాడిలా ఉన్నాడని అనుకుంటాం. కవలపిల్లలో ఎక్కువగా పోలికలు కనిపిస్తాయి. అయితే సంబంధం లేని ఇద్దరిలో ఒకే పోలికలు ఉండడం చాలా తక్కువ. ఆ మధ్య అల్లు శిరీష్ నటించిన ‘ఒక్క క్షణం’ అనే సినిమా వచ్చింది. ప్యారలల్ లైఫ్ ల స్టోరీతో డైరెక్టర్ వి.ఐ.ఆనంద్ ఈ సినిమాని తీశాడు. ఈ మూవీలో హీరోయిన్ సురభి నటించింది. ఈ సినిమాలో లాగానే నిజ జీవితంలో కూడా ఇద్దరి జీవితాలు ఒకేలాగా ఉంటాయా అనే సందేహం అందరికి వస్తుంది.అయితే ఇలానే తెలుగు సినీపరిశ్రమలో ఇద్దరు హీరోలకి కూడా ఐదు పోలికలు ఉన్నాయి. ఇంతకీ ఆ పోలికలు ఏమిటి? మరి ఆ హీరోలు ఎవరో తెలుసుకుందాం. ఆ హీరోలు ఎవరో కాదు. జూనియర్ ఎన్టీఆర్, మంచు మనోజ్. వీరి జీవితాలలో ఒకే రకమైన పోలికలు ఉన్నాయి. అంతేకాకుండా వీళ్ళు రియల్ లైఫ్ లోనూ బెస్ట్ ఫ్రెండ్స్ కూడా,ఇక జూనియర్ ఎన్టీఆర్, మంచు మనోజ్ జీవితాల్లో సిమిలారిటీస్ ఏమిటో చూద్దాం..
1) వీరిద్దరూ 1983లో మే 20న జన్మించారు. అయితే మనోజ్ కంటే ఎన్టీఆర్ ముందు జన్మించారు.

Ads

2) వీరిద్దరూ బాల నటుడిగా ఎంట్రీ ఇచ్చారు. అదికూడా రామారావు గారి చిత్రాల్లోనే. జూనియర్ ఎన్టీఆర్ బ్రహ్మర్షి విశ్వామిత్ర సినిమా ద్వారా బాలా నటుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వగా,మేజర్ చంద్రకాంత్ సినిమాతో మంచు మనోజ్ బాలనాటుడిగా నటించాడు.3) వీరిద్దరి తండ్రులు కూడా రాజ్యసభ ఎంపీలు.4) ఇక వీరిద్దరి సతిమణీల పేర్లు ప్రణతినే. ఎన్టీఆర్ వైఫ్ పేరు లక్ష్మీ ప్రణతి, మంచు మనోజ్ వైఫ్ పేరు ప్రణతి రెడ్డి.
5)హరికృష్ణ రెండో భార్య సంతానం జూనియర్ ఎన్టీఆర్ కాగా, మోహన్ బాబు రెండో భార్య సంతానం మంచు మనోజ్.

Also Read: కైకాల సత్యనారాయణ ఆస్తులు విలువ ఎంత ఉంటుందో తెలుసా?

Previous articleకైకాల సత్యనారాయణ ఆస్తులు విలువ ఎంత ఉంటుందో తెలుసా?
Next articleరైళ్లు మధ్యాహ్నం కంటే రాత్రి సమయంలోనే ఎందుకు వేగంగా వెళతాయో తెలుసా?
Hai this is Kavitha. Cover the media industry. I write on the Movies, TV channels, OTT platforms and anything that is a medium for content distribution.