Ads
ఈ మధ్య కాలంలో జరిగే మోసాల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రభుత్వ స్కీములు మొదలు ఉద్యోగాల వరకు ఎన్నో మోసాలు జరుగుతున్నాయి. అలానే ఆన్లైన్ స్కామ్స్ మొదలు వీధిలో జరిగే మోసాలు వరకు ఎన్నో వింటాం.
కష్టపడకుండా చిన్నచిన్న మోసాలు చేస్తూ జనాన్ని వెర్రి వాళ్ళని చేస్తున్నారు. అలా జరిగే మోసాలలో ఇయర్ క్లీనింగ్ కూడా ఒకటి. అదేంటి ఇయర్ క్లీనింగ్ తో మోసం చేయడమా అని ఆశ్చర్యపోతున్నారా..? అసలు ఈ మోసాన్ని చూస్తే షాక్ అవుతారు.
చెవి లోపల ఉండే గులిమిని మనం క్లీన్ చేసుకుంటూ ఉండాలి. ఇది మన చెవికి రక్షణనిస్తుంది కానీ ఎక్కువ మొత్తంలో పేరుకుపోతే ఇబ్బందులు ఎదుర్కోవాలి. చెవి క్లీన్ చేయించుకోవాలంటే ఆస్పత్రికి వెళ్ళి వైద్యుడి దగ్గర క్లీనింగ్ చేయించుకుంటే మంచిది. అయితే చాలా మంది ఇంత చిన్న దానికి ఎందుకు ఆసుపత్రి వద్దకు వెళ్లడం అని లైట్ తీసుకుంటారు.
Ads
రోడ్డు పక్కన చాలా మంది చెవి క్లీన్ చేస్తామని చెప్తూ ఉంటారు. మీకు కూడా ఈ సందర్భం ఎదురయ్యే ఉంటుంది. వాళ్లు ఏం చేస్తారంటే ఒక చీపురుపుల్లని తీసుకుని దానికి దూదిని కట్టి చెవిలో ఉండే గులిమిని తీస్తారు. సులువుగా వీళ్ళు తొలగిస్తారు కాబట్టి మనం కూడా పెద్దగా ఆలోచించము. కానీ మనల్ని వీళ్ళు బురిడీ కొడతారు. ఇక ఎలా స్కామ్ జరుగుతుందంటే.. స్కాట్ అనే ఒక వ్యక్తి భారతదేశానికి వచ్చినప్పుడు చెవి క్లీన్ చేస్తామని ఒక వ్యక్తి అతని దగ్గరికి వెళ్తాడు. చిన్న పుల్లతో చెవిలో ఉండే గులిమిని తీస్తూ ఉంటాడు.
నిజానికి అతని చెవిలో గులిమి ఎక్కువగా ఉండదు. కాని ఈ మోసగాడు మాత్రం అలా గులిమిని తీస్తూనే ఉంటాడు. ఇంకా చాలా ఉంది అని చెప్తాడు. నిజానికి చెవులో ఏమీ లేకపోయినా పదేపదే వాళ్లు తీస్తున్నట్లు యాక్ట్ చేస్తారు. ఎక్కువ ఇది మన భారతదేశంలో కూడా జరుగుతుంది ఏదేమైనా సరే ఇలాంటి వాళ్ల చేత గులిమి తీయించుకోవడం మంచిది కాదు. పైగా చెవి చాలా సున్నితమైన అవయవం. కాబట్టి చీపురు పుల్లలతో వంటి వాటితో గులిమిని తీయించద్దు.
watch video: