ఈ ఫోటోలో ఉన్న ముగ్గురు యంగ్ హీరోలు ఎవరో గుర్తుపట్టగలరా..?

Ads

ఇప్పుడు ఉన్న హీరోలలో చాలా మంది హీరోలు సినిమా ఇండస్ట్రీలోకి వచ్చాక స్నేహితులు అవుతారు. కొంత మంది హీరోలు సినిమా ఇండస్ట్రీకి రాకముందే స్నేహితులుగా ఉంటారు. ఇంకా కొంత మంది హీరోలు చిన్ననాటి నుండి ఒకరికి ఒకరు తెలిసి ఉంటారు. వారిలో కొంత మంది కలిసి చదువుకొని ఉంటారు. కొంత మంది బంధువులు కూడా ఉంటారు. అలా వాళ్ళు ఇండస్ట్రీలోకి అడుగు పెడతారు. తర్వాత కష్టపడి ఎవరికి వాళ్లు గుర్తింపు సంపాదించుకొని ఈ రంగంలో రాణిస్తారు. సినిమా రంగంలో పోటీ ఉన్నా కూడా బయట మాత్రం చాలా ప్రేమగా ఉంటారు.

can you recognize heroes in this picture

ఈ పైన ఫోటోలో ఉన్న వాళ్లలో ముగ్గురు హీరోలు ఉన్నారు. వాళ్లు కూడా ఇప్పుడు చాలా కష్టపడి గుర్తింపు సంపాదించుకున్నారు. ఈ ఫోటోలో అల్లు అర్జున్, రామ్ చరణ్, అల్లు శిరీష్ అన్నారు. అల్లు రామలింగయ్య గారికి 1990 లో పద్మశ్రీ అవార్డు వచ్చింది. ఆ సమయంలో దిగిన ఫోటో ఇది. అల్లు రామలింగయ్య గారి దంపతులతో పాటు, ఈ ఫోటోలో, అల్లు వెంకటేష్, సుస్మిత కొణిదెల, శ్రీజ కొణిదెల, అల్లు అర్జున్, అల్లు శిరీష్, రామ్ చరణ్ ఉన్నారు. అల్లు వెంకటేష్ అల్లు అర్జున్ వాళ్ళ అన్నయ్య. అందరూ అల్లు రామలింగయ్య గారి దంపతులతో ఫోటో దిగారు. ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఎవరి రంగాల్లో వాళ్ళు రాణిస్తున్నారు. అల్లు వెంకటేష్ అల్లు బాబీగా గుర్తింపు పొందారు.

Ads

can you recognize heroes in this picture

సినిమా నిర్మాణ రంగంలో అల్లు బాబీ ఉన్నారు. సుస్మిత కొణిదల ఫ్యాషన్ డిజైనర్ గా ఉన్నారు. చిరంజీవి నటిస్తున్న సినిమాలకి సుస్మిత కొణిదల కాస్ట్యూమ్ డిజైనింగ్ చేస్తున్నారు. మిగిలిన వాళ్ళందరూ కూడా సినీ రంగంలో, వ్యాపార రంగాల్లో దూసుకెళ్తున్నారు. సినీ నేపథ్యంతో వచ్చినా కూడా వీళ్ళందరూ తమ కష్టాన్ని నమ్ముకుని పైకి వచ్చారు. ఇప్పుడు భారతదేశ వ్యాప్తంగా వీళ్ళందరూ గుర్తింపు సంపాదించుకున్నారు. అల్లు అర్జున్, రామ్ చరణ్ డాన్స్ వీడియోలు కూడా సోషల్ మీడియాలో ఉంటాయి. చిన్నప్పటినుండి వాళ్ళకి యాక్టింగ్, డాన్స్ అంటే ఇష్టం అని ఆ వీడియోలు చూస్తే అర్థం అవుతాయి.

Previous articleసెలబ్రిటీలు చెప్పేవన్నీ అబద్ధాలేనా..? లేదా మనమే తప్పుగా అర్థం చేసుకున్నామా..? అసలు విషయం ఏంటంటే..?
Next article“ఇయర్ క్లీనింగ్” పేరుతో రోడ్ల మీద కొందరు చేసే ఈ మోసం గురించి తెలుసా.?