రామ్ పోతినేని “డబుల్ ఇస్మార్ట్” టీజర్ రివ్యూ..! పూరి జగన్నాథ్ కి హిట్ పడినట్టేనా..?

Ads

ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని ఇవాళ తన 36వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా రామ్ హీరోగా నటిస్తున్న డబుల్ ఇస్మార్ట్ సినిమా టీజర్ విడుదల చేశారు. 2019 లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమాకి ఈ సినిమా సీక్వెల్ గా రూపొందుతోంది. పూరి జగన్నాథ్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. ఇవాళ రిలీజ్ అయిన డబుల్ ఇస్మార్ట్ సినిమా టీజర్ చూస్తే, మొదటి భాగంలో ఉన్న షాయాజీ షిండే, జబర్దస్త్ శ్రీను కూడా కనిపిస్తున్నారు. వాళ్లతో పాటు, హిందీ హీరో సంజయ్ దత్ కూడా ఈ భాగంలో కనిపిస్తున్నారు.

double ismart teaser review

ఇందులో సంజయ్ దత్ విలన్ పాత్రలో నటిస్తున్నారు. సినిమా టీజర్ లో ఎక్కువ అంశాలు చూపించలేదు కానీ, చూపించిన సీన్స్ ప్రకారం చూస్తే మొదటి భాగం టెంప్లేట్ ఫాలో అవుతున్నట్టు అనిపిస్తోంది. హీరోయిన్ కావ్య థాపర్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్నారు. అమ్మాయిని చూసి హీరో చెప్పే డైలాగ్స్, కొన్ని పంచ్ లైన్స్, లాస్ట్ లో వచ్చే శివుడి సీక్వెన్స్ ఇవన్నీ కూడా మొదటి భాగం టెంప్లెట్ ఫాలో అవుతున్నట్టు చాలా మందికి అనిపించింది. మొదటి భాగంలో క్లైమాక్స్ లో వచ్చే శివుడి సీక్వెన్స్ చాలా పెద్ద హిట్ అయ్యింది. అందుకే ఈ సినిమాలో కూడా అలాంటి ఒక సీక్వెన్స్ రూపొందించారు.

Ads

మొదటి భాగంలో ఉన్న లుక్ లోనే ఈ సినిమాలో కూడా రామ్ పోతినేని ఉన్నారు. మణిశర్మ ఈ సినిమాకి సంగీత దర్శకత్వం వహిస్తున్నారు. అయితే మొదటి భాగం చాలా పెద్ద హిట్ అయ్యింది. ఆ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో, అన్ని విమర్శలు కూడా వచ్చాయి. అందులో హీరోయిన్, హీరోకి మధ్య వచ్చే సీక్వెన్స్ మీద చాలా కామెంట్స్ వచ్చాయి. జాతీయ స్థాయిలో ఉన్న ఎన్నో యూట్యూబ్ ఛానల్స్ ఈ విషయం గురించి మాట్లాడాయి.

ఇప్పటికి కూడా ప్రేమ పేరుతో హీరో, హీరోయిన్ ని ఇబ్బంది పెట్టే సన్నివేశాలు అనే ప్రస్తావన వస్తే, ఈ సినిమా టాపిక్ కచ్చితంగా వస్తుంది. అన్ని కామెంట్స్ ఈ సినిమాలో సీన్స్ మీద వచ్చాయి. “ఇప్పుడు ఈ సినిమా టీజర్ చూస్తే రొటీన్ గా అనిపించలేదు. అలా అని చాలా కొత్తగా కూడా అనిపించలేదు. ఒక రకంగా చెప్పాలి అంటే ఇస్మార్ట్ శంకర్ టీజర్ చూసినట్టే అనిపించింది” అంటూ చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ సినిమా ఆ సినిమాకి భిన్నంగా ఉంటుందా అనేది తెలియాలి అంటే ట్రైలర్ విడుదల అయ్యేంతవరకు ఆగాల్సిందే.

watch video :

Previous article“ఇయర్ క్లీనింగ్” పేరుతో రోడ్ల మీద కొందరు చేసే ఈ మోసం గురించి తెలుసా.?
Next articleకేవలం కళ్ళని మాత్రమే చూసి… ఈ హీరో ఎవరో చెప్పగలరా..?
Hi, This is Harika. I have been working as a web content writer in PRATHIDVANI from the past one year and am experienced in writing articles in cinema, sports, inspiring stories and flash news categories.