ట్రైన్ లో ట్రావెల్ చేసేటప్పుడు.. సీట్లు ఎక్కడ ఖాళీ ఉన్నాయో.. ఇలా సులభంగా తెలుసుకోండి..!

Ads

రైలు ప్రయాణం చాలా సౌకర్యంగా ఉంటుంది. చాలా మంది ట్రైన్ లో ట్రావెల్ చేస్తూ ఉంటారు మీరు కూడా ట్రైన్ లో ట్రావెల్ చేస్తూ ఉంటారా..? అయితే కచ్చితంగా మీరు ఈ విషయాన్ని తెలుసుకోవాలి. రైలు లో సౌకర్యవంతంగా ప్రయాణం చేయాలంటే కచ్చితంగా సీటు కన్ఫామ్ అవ్వాలి. లేదంటే ప్రయాణం చాలా ఇబ్బందిగా ఉంటుంది. అడ్జెస్ట్ అయ్యి ప్రయాణం చేయడం కష్టంగా ఉంటుంది చాలా మంది రిజర్వేషన్ చేసుకున్న క్రమంలో ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు.

రైలు లో ప్రయాణం చేసేటప్పుడు సీటు ఎక్కడ ఖాళీగా ఉందో తెలుసుకోవచ్చు. ఇలా ఖాళీగా ఉన్న సీటు గురించి తెలుసుకొని మీరు హాయిగా ప్రయాణం చేయొచ్చు. చాలా మంది సీటు ఎక్కడ ఖాళీ ఉంది అనేది తెలుసుకోవడం కష్టంగా భావిస్తారు అందుకోసం టీటీఈ చుట్టూ తిరగాల్సిన పనే లేకుండా ఈజీగా ఈ పద్ధతిని ఫాలో అయిపోవచ్చు.

Ads

రైలులో ప్రయాణం చెయ్యాలని అనుకుంటే ఏ కోచ్ ఏ బెర్త్ అందుబాటులో ఉందనేది మీరు ఈజీగా మీ చేతిలో ఉన్న మొబైల్ ఫోన్ ద్వారా తెలుసుకోవచ్చు. IRCTC యాప్ సహాయంతో ట్రైన్ లో కాళీ బెర్త్ లేదా సీటు గురించి మీరు ఫుల్ గా తెలుసుకోవచ్చు.

  • దీనికోసం ముందు మీరు యాప్ ని ఓపెన్ చేసి ట్రైన్ ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
    తర్వాత చాట్ ఎంప్టీ ఐకాన్ మీద నొక్కండి.
  • రైలు పేరు, రైలు నెంబర్, బోర్డింగ్ స్టేషన్, తేదీ వంటి వివరాలను ఇవ్వాల్సి ఉంటుంది.
  • ట్రైన్ లో సీట్ లేదా బెర్త్ అందుబాటులో ఉంటే దాని వివరాలు మీకు అక్కడ కనబడతాయి.
  • ఏ కోచ్ లో ఏ క్లాస్ లో ఎన్ని సీట్స్ ఖాళీగా ఉన్నాయి అనేది మీరు ఈజీగా తెలుసుకుని దానికి తగ్గట్టుగా మీరు బుక్ చేసుకోవచ్చు. దీనికోసం మీరు యాప్ కి వెళ్లి లాగిన్ చేయక్కర్లేదు అలానే సైన్ ఇన్ చేయకుండానే సమాచారాన్ని పొందొచ్చు.
Previous articleసమరసింహారెడ్డి సినిమాలో నటించిన ఈ అమ్మాయి మీకు గుర్తుందా..? రామ్ చరణ్ కి ఏం అవుతుందంటే..?
Next articleహీరోయిన్ లేకుండా హిట్ అయిన 6 సినిమాలు ఇవే..!