సమరసింహారెడ్డి సినిమాలో నటించిన ఈ అమ్మాయి మీకు గుర్తుందా..? రామ్ చరణ్ కి ఏం అవుతుందంటే..?

Ads

బాలకృష్ణ హీరోగా వచ్చిన సమరసింహారెడ్డి సినిమా మీకు గుర్తుందా..? సమరసింహారెడ్డి లో బాలకృష్ణ సరసర సిమ్రాన్, అంజలి జవేరి నటించారు. జయప్రకాష్ రెడ్డి తదితరులు ముఖ్య పాత్రలు చేశారు. సమరసింహారెడ్డి సినిమాకి బి.గోపాల్ దర్శకత్వం వహించారు. మణిశర్మ ఈ సినిమాకి సంగీతం అందించారు. విజయేంద్ర ప్రసాద్ ఈ సినిమాకి కథని అందించారు. శ్రీ సత్యనారాయణమ్మ ప్రొడక్షన్స్ ఆధ్వర్యంలో ఈ సినిమాని నిర్మించారు.

విజయేంద్ర ప్రసాద్ సింధూరపువ్వు అనే తమిళ సినిమా నుండి సమరసింహారెడ్డి సినిమాని తీసుకువచ్చారు. ఫ్యాక్షనిజం నేపథ్యంలో ఈ సినిమా ఉంటుంది. ఈ సినిమాలో పాటలు కూడా బాగుంటాయి. ఇక సమరసింహారెడ్డి సినిమాలో నటించిన ఈ అమ్మాయి మీకు గుర్తుందా..?

Ads

బాలకృష్ణ చిన్న చెల్లెలుగా దివ్యంగురాలుగా సర్వస్వతి పాత్ర లో ఓ చిన్నారి నటించింది. సమరసింహారెడ్డి పేరు చెప్తే ఈ అమ్మాయి కూడా గుర్తు వస్తుంది. అందులో ముఖ్యంగా రైల్వే ట్రాక్ సీన్ బాగా అందరికీ గుర్తుంటుంది. ఈ పాత్ర పోషించిన అమ్మాయి పేరు సహస్ర. ఎన్నో వందల సినిమాల్లో ఈమె చైల్డ్ ఆర్టిస్ట్ కింద నటించింది. సినిమాలే కాదు ఈమె చదువు మీద కూడా శ్రద్ధ పెట్టదు. ఇప్పుడు ఆమె గొప్ప బిజినెస్ మ్యాన్ గా మారింది. ఒక ప్రముఖ యూట్యూబ్ ఛానల్ కి ఈమె తాజాగా ఒక ఇంటర్వ్యూ ఇచ్చింది. ఆసక్తికరమైన విషయాలను షేర్ చేసుకుంది.

చిన్నప్పుడు ఈమె చాలా ముద్దుగా ఉండేవారట. చిరంజీవి గారితో రౌడీ అల్లుడు సినిమా చేస్తున్నప్పుడు ఆయన ఇంటికి తీసుకువెళ్లారు. రామ్ చరణ్ కి ఇష్టమైన టెడ్డి బేర్ తో అక్కడ ఆడుకున్నానని రామ్ చరణ్ కూడా నాకు చిన్నప్పుడు మంచి స్నేహితుడు.. బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పింది. ఇది ఇలా ఉంటే సమరసింహారెడ్డి సినిమా రికార్డులు అన్నిటిని కూడా బద్దలు కొట్టింది. సుమారుగా 16 కోట్ల రూపాయల షేర్ ని ఈ సినిమా వసూలు చేసింది.

Previous articleవెంక‌టేశ్వ‌ర స్వామికి వ‌డ్డీ కాసుల వాడ‌నే పేరు ఎలా వచ్చింది అంటే..?
Next articleట్రైన్ లో ట్రావెల్ చేసేటప్పుడు.. సీట్లు ఎక్కడ ఖాళీ ఉన్నాయో.. ఇలా సులభంగా తెలుసుకోండి..!