Ads
తెలుగు సినిపరిశ్రమలో వరుస విషాదాలు అందరిని కలచివేస్తున్నాయి. నటుడు కైకాల సత్యనారాయణ మరణమను మారిచిపోక ముందే మరో సీనియర్ నటుడు చలపతిరావు 79 ఏళ్ల వయసులో శనివారంనాడు రాత్రి సమయంలో గుండెపోటుతో కన్నుముశారు.
55సంవత్సరాల సినీ ప్రస్థానంలో ఆయన దాదాపు 1200కు పైగా చిత్రాలలో నటించి, టాలీవుడ్‌లో తనకంటూ ఒక గుర్తింపును సంపాదించుకున్నారు. ఆయన నటుడుగా మాత్రమే కాకుండా నిర్మాతగా మరి ఏడు చిత్రాలను నిర్మించారు. ఆయన పూర్తిపేరు తమ్మారెడ్డి చలపతిరావు. ఏపీలోని కృష్ణా జిల్లా బలిపర్రులో 1944లో మే 8న జన్మించారు. 1966లో చలపతిరావు ఇరవై రెండు ఏళ్లకే తెలుగు సీనిపరిశ్రమలోకి అడుగుపెట్టారు. చలపతిరావు తొలి సినిమా సూపర్‌స్టార్ కృష్ణ నటించిన మూవీ గూఢచారి 116. ఆ తరువాత 1967లో సాక్షి సినిమాలో ఒక పాత్రలో నటించారు.
Ads
అయితే ఆ తరువాత రెండేళ్ల వరకు కూడా అవకాశాలు రాలేదు. 1969లో బుద్ధిమంతుడు సినిమాలో నటించారు. ఇక ఆ తరువాత చలపతిరావు వెనక్కి తిరిగి చూసుకోలేదు. వరుసగా సినిమాలు చేస్తూ దూసుకెళ్లారు. ఇక విలనిజంలో ప్రత్యేక శైలితో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అలా 1200కు పైగా సినిమాల్లో ఆయన నటించారు.విలన్‌గా మాత్రమే కాకుండా వివిధ రకాల పాత్రల్లోను చలపతిరావు నటించి, మెప్పించారు. నాగార్జునకు తండ్రిగా డైరక్టర్ కృష్ణవంశీ తీసిన నిన్నేపెళ్లాడతా సినిమాలో నటించడం చలపతిరావు కెరీర్ టర్న్ అయ్యిందని చాలాసార్లు చెప్పారు. చలపతిరావుకి ముగ్గురు సంతానం. కుమారుడు రవిబాబు తెలుగులో నటుడిగా, డైరెక్టర్ గా మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. ఇద్దరు కుమార్తెలు అమెరికాలో స్థిరపడ్డారు.
అయితే ముగ్గురు పిల్లలు పుట్టిన తరువాత కొన్ని సంవత్సరాలకే ఆయన భార్య ఇందుమతి అగ్నిప్రమాదంలో మరణించారు. ఈ సంఘటన చెన్నై ఇంట్లోనే జరిగింది. ఒకరోజు ఉదయాన్నే ఇందుమతి చీరకు నిప్పంటుకుని, అరవడంతో చలిపతిరావు మంటలను ఆర్పీ, హాస్పటల్ లో చేర్చారు. అయితే 3 రోజులు తరువాత హాస్పటల్ లోనే ఆమె మరణించింది. ఇక ర తరువాత చలపతిరావు మళ్ళీ పెళ్లి చేసుకోలేదు.
Also Read: చిరంజీవి vs బాలకృష్ణ.. సంక్రాంతిబరిలో ఇప్పటిదాకా ఎవరు ఎక్కువ హిట్స్ ఇచ్చారో తెలుసా?