Ads
ఇది వరకు ప్రతి రోజూ చాలా మంది న్యూస్ పేపర్ ని చదివే వారు. కానీ ఇంటర్నెట్ వచ్చాక న్యూస్ పేపర్ ని కొనుగోలు చేయడం చాలా మంది మానేశారు. ఫోన్లోనే వార్తలని చూస్తున్నారు చాలా మంది. అలానే యూట్యూబ్లో కూడా న్యూస్ ని చాలా మంది చూస్తూ ఉంటారు. ఇలా ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు న్యూస్ ని ఫాలో అవుతున్నారు.
కానీ ఈ రోజుల్లో కూడా కొందరు న్యూస్ పేపర్ చదువుతున్నారు. న్యూస్ పేపర్ చదవడం తోనే వారి రోజుని మొదలు పెడతారు. ఒక కప్పు కాఫీతో కూర్చుని న్యూస్ పేపర్ ని పూర్తిగా చదివే వరకు కదలరు.
అయితే మీరు ఎప్పుడైనా న్యూస్ పేపర్ లో ఉండే ఈ డాట్స్ ని గమనించారా..? చివర్లో ఉండే ఈ చుక్కల గురించి ఇప్పుడు మనం చూద్దాం. న్యూస్ పేపర్ చివరిన దాదాపు నాలుగు డాట్స్ మనకి కనపడుతూ ఉంటాయి. దానికి వెనుక కారణం వుంది. ఊరికే అలా ప్రింట్ చెయ్యరు.
Ads
ఈ చుక్కలు ని బట్టీ న్యూస్ పేపర్లో ప్రింట్ ఎలా వుంది అనేది తెలుసుకోవచ్చు. ఈ చుక్కలు ఎప్పుడూ ఒకే ఆర్డర్ లో ఉంటాయి. వేరు వేరు రంగులలో ఉంటాయి. అప్పుడప్పుడు చుక్కలు సరిగా ప్రింట్ కావు. అలా కనుక ఉంటే న్యూన్ పేపర్ లో ప్రింటింగ్ అలైన్మెంట్ సరిగా లేదని దాని అర్ధం. ఒకవేళ కనుక ఈ చుక్కలు బాగానే ఉంటే.. ప్రింటింగ్ అలైన్మెంట్ బాగున్నట్టు. ఇక ఈ చుక్కుల కలర్స్ కోసం చూస్తే.. ఈ చుక్కలు సీఎంవైకె సీక్వెన్స్ లో ఉంటాయి. C – సియాన్ (నీలం), M – మెజెంటా (పింక్), Y – ఎల్లో (పసుపు), K – బ్లాక్ (నలుపు). ఈ ఆర్డర్ లోనే ఈ చుక్కలు ఉంటాయి.