OM BHEEM BUSH REVIEW: “బ్రోచేవారెవరురా” కాంబో మరోసారి నవ్వించడంలో సక్సెస్ అయ్యారా.? “ఓం భీం బుష్” స్టోరీ, రివ్యూ&రేటింగ్!

Ads

హీరో శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ కలిసి నటించిన చిత్రం “ఓం భీమ్ బుష్”. ఈ సినిమా ఈ రోజు ప్రేక్షకుల ముందుకి వచ్చింది. ఈ సినిమా ఎలా ఉందో రివ్యూ చూద్దాం రండి.

  • చిత్రం : ఓం భీమ్ బుష్
  • నటీనటులు : శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ, ప్రీతి ముకుందన్, అయేషా ఖాన్, ఆదిత్య మీనన్.
  • నిర్మాత : సునీల్ బలుసు
  • దర్శకత్వం : శ్రీ హర్ష కొనుగంటి
  • సంగీతం : సన్నీ ఎం.ఆర్.
  • విడుదల తేదీ : మార్చి 22, 2024

స్టోరీ :

కృ ష్ణ కాం త్ అలియాస్ క్రిష్(శ్రీవిష్ణు), వినయ్ గుమ్మ డి(ప్రియదర్శి ), మాధవ్ రేలం గి అలియాస్ మ్యా డీ(రాహుల్ రామకృ ష్ణ) ముగ్గురు మంచి స్నే హితులు. పీహెచ్డీ చేయడానికి ముగ్గురు లెగసీ యూనివర్సిటీలో చేరుతారు. కాలేజీలో పీహెచ్‌డీ పేరుతో ఉంటూ నానా రచ్చ చేస్తుంటారు. ళ్ళని బ్యాంగ్ బ్రదర్స్ అని అంటారు. 5 సంవత్సరాలు అయినా సరే వీళ్ళ పీహెచ్డీ పూర్తి అవ్వదు. వీళ్ళు చేసే పనులు తట్టుకోలేక కాలేజ్ ప్రిన్సిపాల్ రంజిత్ వినుకొండ (శ్రీకాంత్ అయ్యంగార్) వీళ్ళకి డాక్టరేట్లు ఇచ్చి పంపిస్తాడు.

తిరిగి ఊరికి వెళ్తూ భైరవపురం దగ్గర ఆగుతారు. ఆ ఊరిలో తాంత్రిక విద్యల పేరుతో డబ్బు సంపాదించాలి అనుకుంటారు. ఏ టు జెడ్ సర్వీసెస్ పేరుతో ఒక వ్యాపారం తెరుస్తారు. వీళ్ళని బ్యాంగ్ బ్రోస్ అని పరిచయం చేసుకుంటారు. కానీ తర్వాత వీళ్ళ బండారం అంతా బయట పడిపోతుంది. వాళ్లు సైంటిస్టులు కాదు అనే విషయం ఊరి వారికి తెలిసిపోతుంది. అక్కడి పరిస్థితులు వీళ్ళని ఎలా మార్చాయి? ఆ గ్రామంలో ఉన్న సంపంగి దెయ్యంని బ్యాంగ్ బ్రోస్ ఎందుకు పట్టుకోవడానికి వెళ్లారు?ఇవన్నీ తెలియాలి అంటే మీరు సినిమా చూడాల్సిందే.

రివ్యూ :

Ads

ఓం భీమ్ బుష్ సినిమా క్యాప్షన్ నో లాజిక్.. ఓన్లీ మ్యాజిక్… అదే విధంగా కామెడీ నేపథ్యంలో ఈ సినిమా సాగుతుంది. సినిమా ఫస్టాఫ్‌ అంతా కాలేజీ సీన్లతో కామెడీగా సాగుతుంది. సినిమా మొత్తంలో వాళ్ళు ఎదుర్కొనే సంఘటనల వల్ల కామెడీ వస్తుంది. అందుకే కామెడీ సహజంగా అనిపిస్తుంది. సినిమా కోసం రాసుకునే కథలోనే కామెడీ ఉండేలాగా చూసుకున్నారు. కొన్ని సీన్స్ మాత్రం చాలా బాగా నవ్వు తెప్పిస్తాయి.ఆడియన్స్ ని నవ్వించడంలో మరోసారి బ్రోచెవారెవరురా కాంబోను రిపీట్ చేశారు.

ఇక ఊరిలోకి వెళ్లాక సంపంగి దెయ్యం చుట్టూ వచ్చే ట్రాక్ కూడా చాలా కామెడీగా ఉంటుంది. ప్రీతి ముకుందన్, అయేషా ఖాన్‌ వాళ్ళ పాత్రలకి న్యాయం చేసారు. ప్రియా వడ్లమాని ఒక సాంగ్‌లో అలరిస్తుంది. రాజ్ తోట సినిమాటోగ్రఫీ బాగుంది. సన్నీ అందించిన పాటలు, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగున్నాయి. కానీ కొన్ని సీన్స్ మాత్రం స్లోగా అనిపిస్తాయి. హీరో, హీరోయిన్స్ మధ్య లవ్ ట్రాక్ కూడా పెద్దగా ఆకట్టుకోదు. ఈ విషయాల్లో మాత్రం ఇంకా కొంచెం జాగ్రత్త తీసుకొని ఉంటే బాగుండేది ఏమో అనిపిస్తుంది.

ప్లస్ పాయింట్స్ :

  • ఎంచుకున్న కాన్సెప్ట్
  • నటీనటుల పర్ఫార్మెన్స్
  • కామెడీ సీన్స్
  • నిర్మాణ విలువలు

మైనస్ పాయింట్స్:

  • స్లోగా సాగి కొన్ని సీన్స్
  • హీరో, హీరోయిన్ మధ్య లవ్ ట్రాక్

రేటింగ్ : 3/5

ట్యాగ్ లైన్ :

లాజిక్స్ అనే విషయాన్ని పక్కన పెట్టి, అలాంటివి లేకపోయినా పర్లేదు, మంచి కథ ఉంటే చాలు, హాయిగా ఒక మూడు గంటల పాటు నవ్వుకోవాలి అనే ఉద్దేశంతో ఈ సినిమా చూస్తే మాత్రం ఓం భీమ్ బుష్ సినిమా ఒక మంచి కామెడీ ఎంటర్టైనర్ గా నిలుస్తుంది.

watch trailer :

 

Previous articleన్యూస్ పేపర్ చివర ఎందుకు ఈ నాలుగు రంగు చుక్కలు ఉంటాయి..? కారణం ఇదే..!
Next articleగుండె పోటు రావడానికి అరగంట ముందు ఏం అవుతుందో తెలుసా..?
Hi, This is Harika. I have been working as a web content writer in PRATHIDVANI from the past one year and am experienced in writing articles in cinema, sports, inspiring stories and flash news categories.