Ads
ప్రస్తుతం ప్రతి ఒక్కరూ మినరల్ వాటర్ తాగడానికే ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తున్నారు. ఒకప్పుడు అయితే ఊరంతటి కోసంఒక వాటర్ ట్యాంక్ ఉండేది. లేదంటే బావుల్లో ఉన్న నీటిని తోడుకుని ఉపయోగించేవారు. ఆ తరువాత ట్యాప్స్ వచ్చాయి. కొన్నాళ్ళు పట్టుకుని తాగేవారు.
రాను రాను ఆ పద్ధతి తగ్గిపోయి కొత్తగా మినరల్ వాటర్‌కి అంతా అలవాటు పడ్డారు. ఇంట్లో వాడడానికి కూడా అవే తెప్పించుకుంటున్నారు. ఇక ప్రయాణాల్లో ప్యాకేజ్డ్ వాటర్ బాటిల్స్ ను కొని, తాగుతున్నారు. అయితే ఈ బాటిల్స్ క్యాప్స్ వివిధ కలర్స్ లో ఉంటాయి. వాటి అర్ధం ఏమిటో ఇప్పుడు చూద్దాం..
ప్రకృతి తాగునీటిని ప్రజలకు అందిస్తోంది. పలు కంపెనీలు ఈ నీటిని శుద్ది చేసి, అమ్ముతున్నారు. వాటర్ బిజినెస్ లోకి చాలా సంస్థలు ప్రవేశించాయి. నీటిని శుద్ధి చేసి, ప్లాస్టిక్ సీసాలలో విక్రయిస్తున్నారు. ఇది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సర్వసాధారణం అయిపోయింది. మార్కెట్లో అనేక బ్రాండ్ల వాటర్ బాటిళ్లు అందుబాటులో ఉన్నాయి.
మినరల్ వాటర్ బాటిల్స్‌లో రకరకాల రంగుల క్యాప్‌లు ఉన్నాయని చాలా మంది అంతగా గమనించి ఉండరు. ఇక ఈ రంగుల క్యాప్ ల వెనుక ఉన్న కారణం కూడా ఎక్కువ మందికి తెలియకపోవచ్చు. ప్రతి రంగు ఒక అర్థాన్ని సూచిస్తుంది. సోషల్ మీడియా వేదిక ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ లో ఒక యూజర్ షేర్ చేసిన వీడియోలో క్యాప్స్ వాటర్ బాటిళ్ల రంగులు అర్ధాన్ని వివరించారు. వైట్ క్యాప్ ఉంటే ఆ బాటిల్‌లోని నీరు ప్రాసెస్ చేయబడిందని అర్ధం.
బ్లాక్ కలర్ క్యాప్ ఉంటే ఆల్కలైన్ వాటర్ అని అర్థం. బ్లూ కలర్ క్యాప్ అంటే నీటి బుగ్గ (స్ప్రింగ్)నుండి సేకరించిన వాటర్, ఇక గ్రీన్ కలర్ క్యాప్ అయితే ఫ్లేవర్డ్ వాటర్ అని అని వివరించారు. ఈ వీడియోకు “బాటిల్ క్యాప్ సీక్రెట్ అర్థం మీకు తెలియనంత వరకు నీటిని కొనుగోలు చేయవద్దు” అని ఇచ్చారు.
Also Read: వాష్ బేసిన్ మధ్య భాగంలో ఈ హోల్ ఎందుకు ఉంటుందో తెలుసా.. ?